|
Context
Song Context:
నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా!
ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతే ఒప్పుకోను ఇంత కంటే ఎందుకనుకుందామా! |
Song Lyrics
||ప|| |ఆమె|
నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను
లోకమంటే మనమే అందామా
|అతడు|
ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతే ఒప్పుకోను
ఇంత కంటే ఎందుకనుకుందామా
|ఆమె| ఇష్టమొచ్చినట్టు ఉందాం |అతడు| తోచినట్టు చేద్దాం
|ఆమె|
ఇష్టమొచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం
సమయానే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
|అతడు|
సమయానే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
ఈ ఏకాంతం మనకే సొంతం ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం
|| నాకు నువ్వు ||
.
||చ|| |ఆమె|
చంటిపాప లాంటి మనసున్నవాడు కొంటె కృష్ణుడల్లే మహ తుంటరోడు
మన్మథుడి కన్న గొప్ప అందగాడు నా మదినే దోచేశాడు
|అతడు|
ఎవరే అంతటి మొనగాడు ఏడే ఎక్కడ ఉన్నాడు
వాడేనా నీ జతగాడు వదిలేస్తావా నా తోడు
|ఆమె|
సరిసాటిలేని ఆ మగవాడు ఒకడంటే ఒక్కడే ఉన్నాడు
ఇటు చూడిలాగా నా కంటిపాపలో నువ్వే ఆ ఒకడూ
||నాకు నువ్వు||
.
||చ|| |అతడు|
చందమామ సిగ్గుపడి తప్పుకొని సిగ్గులేని జంట ఇది అనుకునీ
చక్కనైన నిన్ను చూసి చుక్కలన్నీ ఆకాశంలో దాక్కోని
|ఆమె|
అందం ఉన్నది నీకోసం ఇందా అన్నది సావాసం
నీతోనే నా కైలాసం నువ్వేగా నా సంతోషం
|అతడు|
ఇంకొక్కసారిలా ఈ సత్యం ఒట్టేసి చెప్పనీ నీ స్నేహం
సుడిగాలిలాగ చెలరేగిపోద మరి నాలో ఉత్సాహమ్మ్
||నాకు నువ్వు||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »