|
Context
Song Context:
సంద్రంలో సందడంతా, చంద్రుళ్ళో వెన్నెలంతా,
చిన్నారి సంతానంగా చేరే మన ఇంట!
(ఈ కుటుంబానిది భలే సింపుల్ సిద్ధాంతం!)
|
Song Lyrics
||ప|| |అతడు|
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకీ నవ్వుల కేరింత
|ఆమె|
ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట
|అతడు| సంద్రంలో సందడంతా |ఆమె| చంద్రుళ్ళో వెన్నెలంతా
|అతడు|
చిన్నారి సంతానంగా చేరే మన ఇంట
||ఎన్నో ఎన్నో రాగాలుండే ||
.
చరణం: |ఆమె|
ఏ పూటైనా హాపీ గా ఉందాం మనకొద్దు అంతకు మించి వేరే వేదాంతం
|అతడు|
ఏ బాటైనా ఫరవాలేదంటాం సమయంతో సాగటమే మన సింపుల్ సిద్ధాంతం
|ఆమె|
చిరుగాలికి పరిమళమిచ్చే సిరిమల్లెల వనమై ఉందాం
|అతడు|
గగనాన్ని నేలను కలిపే హరివిల్లుల వంతెన ఔదాం
|ఆమె|
ఆనందం అంటే అర్థం మనమందాం
ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో
||ఎన్నో ఎన్నో రాగాలుండే ||
.
చరణం: |ఆమె|
మమకారాలే పూవుల సంకెళ్ళై గత జన్మల ఋణ బంధాలను గుర్తుకు తెస్తాయి
|అతడు|
అనురాగాలే గుండెల సవ్వళ్ళై బ్రతుకంటే ఎంతో తీపని చెపుతూ ఉన్నాయి
|ఆమె|
వరమల్లే దొరికినదేమో అరుదైన ఈ అనుబంధం
|అతడు|
సిరులన్నా దొరకనిదేమో సరదాలతో ఈ సావాసం
|ఆమె|
చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి
ఏ చింతా చెంతకు రాని అందాల ఈ సందడి
||ఎన్నో ఎన్నో రాగాలుండే ||
.
.
(Contributed by Dr. Jayasankar) |
Highlights
Also compare this song with సంక్రాంతి: ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
.
[Also refer to Pages 173 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………… |
|
No Comments »