|
Context
Song Context:
He accidentally ran over & killed her lover, which she doesn’t know.
In repentance, he wants take care of her lover’s family & also her.
Will he ever give her a new life?
నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ
రేపటి ఉదయం కోసం ముందడుగు వేయమంటూ
తెలవారని రేయిని నడిపే వెలుగవగలనా! |
Song Lyrics
||ప|| |అతడు|
మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
మూగవోయిన జీవితం మళ్లీ పలికేనా
చిరునవ్వులు ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా
కలజారిన ఈ కనుపాపలకి నలువైపుల నలుపేనా ఏమో
||మంచు తాకిన||
.
||చ|| |అతడు|
తుంచిన పూలను తెచ్చి అతికించలేనుగానీ
చైత్రం నేనై వచ్చి నా తప్పు దిద్దుకోనీ
చిగురాశలు రాలిన కొమ్మ చినబోకమ్మా
పచ్చదనం నీలో ఇంకా మిగిలుందమ్మా
అందామని ఉన్నా అవకాశం ఉందా
నిందించలేని మౌనమే నన్నాపగా
||మంచు తాకిన||
.
||చ|| |అతడు|
నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ
రేపటి ఉదయం కోసం ముందడుగు వేయమంటూ
తెలవారని రేయిని నడిపే వెలుగవగలనా
తడి ఆరని చెంపలు తుడిచే చెలిమవగలనా
నిదురించని నిజమై నిలదీసే గతమే
భరించలేని భారమై వెంటాడగా
||మంచు తాకిన||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
1 Comment »