|
Context
Song Context:
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగ నీ లీల యతిని నృత్య రతుని చేయగలిగే ఈ వేళ |
Song Lyrics
||ప|| |ఆమె|
భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా!
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశా!
నీలకంధరా, జాలి పొందరా! కరుణతో నను గనరా!
నేలకందరా, శైలమందిరా! మొఱ విని బదులిడరా!
నగజామనోజ, జగదీశ్వరా! బాలేందుశేఖరా, శంకరా!
|| భరత ||
.
||చ|| |ఆమె|
అంతకాంత, నీ సతి అగ్నితప్తమైనది
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది!
ఆదిశక్తి ఆకృతి, అద్రిజాత పార్వతి
స్థాణువైన ప్రాణధవుని చెంతకి చేరుకున్నది!
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగ నీ లీల యతిని నృత్య రతుని చేయగలిగే ఈ వేళ
.
||చ|| |ఆమె|
వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా
యోగివేశ నీ మనసున కలగదా రాగలేశమైనా?
హే!మహేశ నీ భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాధ ప్రథమనాద శ్రుతి వినవా!
.
. |
Highlights
…………………………………………………………………………………………………
|
|
3 Comments »