Posted by admin on 14th May 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song!
|
Song Lyrics
||ప|| |అతడు|
ముద్దొస్తోంది మస్తుగుంది ముట్టుకుంటే మెత్తగుంది
రేకు విచ్చే సోకు పూబంతి
|ఆమె|
గమ్మత్తుగుంది మత్తుగుంది హత్తుకుంటే కొత్తగుంది
వేడి పెంచే ఈడు ఇబ్బంది
|అతడు|
అంత వేడెందుకో
|ఆమె|
అచ్చచ్చో అచ్చచ్చో
|అతడు|
వచ్చి వేలందుకో
|ఆమె|
అంత జాలెందుకో..
|అతడు|
అచ్చచ్చో అచ్చచ్చో
|ఆమె|
రెచ్చిపోవెందుకో
||ముద్దొస్తోంది ||
.
||చ| |అతడు|
ఇంటా బయటా తేడా లేక
తాడో పేడో తేలేదాకా తంటాలు పడదాం మరి
|ఆమె|
నిన్నూ నన్నూ ఇద్దర్లాగా
చూడాలన్నా వీలే లేక పెనవేసుకుంటే సరి
|అతడు|
వస్తున్నా…
|ఆమె|
చూస్తున్నా…
|అతడు|
తెగ తరిమిన తపనలకిక సెలవనుకో
||ముద్దొస్తోంది ||
.
||చ|| |ఆమె|
ముస్తాబంతా ముందే ఉంది ఊహిస్తుంటే ఏమొస్తుంది
నీ మరపు నా నేరమా
|అతడు|
నీ ఒంపుల్లో చూపే చిక్కి ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది
కన్నెరుపు తగ్గించుమా
|ఆమె| కంగారా…
|అతడు| అడగాలా…
|ఆమె|
తహతహలకు పెదవుల తడి మందనుకో
||ముద్దొస్తోంది ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)