|
Context
Song Context:
A love song (with an interesting debate) 
|
Song Lyrics
||ప|| |అతడు|
ఏం మంత్రం వేశావో ఏం జాదూ చేశావో
బాణంలా నీ వైపే దూసుకు వస్తున్నా
|ఆమె|
ఏం మాయలో ఉన్నావో నా మహిమనుకున్నావో
వెంటాడే నీ వేగం చూస్తూనే ఉన్నా
|అతడు|
దూకుతున్న ఈ సంతోషాన్ని నీకు చెప్పుకుంటేనేగానీ
ఆగదే కదే తొందరపడిపోతున్నా
|ఆమె|
దిక్కులన్ని గాలిస్తే గానీ చిక్కనంటూ నా ఆచూకీని
దాచలేదుగా ఇదిగో ఇక్కడ ఉన్నా
||ఏం మంత్రం ||
.
||చ|| |అతడు|
రోజూ నన్నే చూసేవాళ్లు మళ్లీ మళ్లీ చూస్తున్నారు
ఎందుకో కాస్త కనుక్కో
వాడేనా వీడంటున్నారు కాదేమో అనుకుంటున్నారు
తేడా ఉందనుకో
|ఆమె|
గాలి గీలి సోకేవాళ్లు నీలాగే అయిపోతుంటారు
చూసుకో మందు వేసుకో
తాయత్తుల్ని కట్టేవాళ్లు ఊళ్లో చాలా మందుంటారు
వెంటనే వెళ్లి వెతుక్కో
|అతడు| నువ్వన్నది కొంత నిజమే అనుకో
ఆ గాలి నువ్వే అని ఒప్పుకో
|ఆమె|
నా మీద నీ గాలి మళ్లిందే అనుకో
ఆ తప్పు నీదే నువ్వే దిద్దుకో
|అతడు|
అందమైన ఊహలు పెంచి ఇంతగా నను తెగ నప్పించి
తప్పుకుంటానంటే వదిలేస్తానా
||ఏం మాయలో ఉన్నావో ||
.
||చ|| |అతడు|
చాలా కాలంగా నా కళ్లు ఖాళీగా ఉండే వాకిళ్లు
నిన్ను నే చూసేవరకూ వేల కొద్దీ నక్షత్రాలు నింపుకున్న కళ్లు చూడు
ఇంతలో ఎంత ఇరుకు
|ఆమె|
ఏకాంతంలో సావాసాలు చాల్లే గాని ఇంకెన్నాళ్లు
చూడవా కాస్త వెలుగు
దీపం పెట్టే ఆనందాలు పాదం పెట్టాయంటే చాలు
చెల్లదా నీ కులుకు
|అతడు|
నా చుట్టూ చేరిన కలలూ కళలూ
నీ వెంట వచ్చిన చుట్టాలు
|ఆమె|
గువ్వల్లా వాలిన ఈ కువకువలు
గుండెల్లో రేపవా సందడులూ
|అతడు|
చిన్న మాటతో చిత్రం చేసి
ఉన్నపాటుగా నన్నే మార్చే సంగతేమిటో అడగాలనుకుంటున్నా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)