|
Context
Song Context:
This super confident girl knows how to express it as well 
విడిపోని బందమేదో కలిపేలా మెడలోన వాలనుంది వరమాల
- ప్రాయం పొంగే పాలకడలి అలలా!
|
Song Lyrics
||ప|| |ఆమె|
పండు వెన్నెల్లో ఈ వేణు గానం
నీదేనా ప్రియ నేస్తం అంటూంది నా ప్రాణం
||పండు వెన్నెల్లో||
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం
నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
ఎద నీరాక కోసం పలికే స్వాగతం
||పండు వెన్నెల్లో||
.
||చ|| |ఆమె|
ఎగిరే గోరింకా ఇటు రావా నా వంకా
నువు ఎందాక పోతావో నేను చూస్తాగ చాల్లే ఎంతసేపింకా
దిగుతావే చక్కా అలిసాక నీ రెక్కా
నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాకా
వెనుకకు వచ్చే గురుతులు మరిచే తికమక పడనీకా
అటు ఇటు అంటూ నిను నడిపించే పిలుపులు నేనేగా
రప్పించుకోనా నిన్ను నాదాకా
||పండు వెన్నెల్లో||
.
||చ|| |ఆమె|
కన్నె సీతమ్మకే పెళ్ళీడు వచ్చిందని
కబురు వెళ్ళిందిగా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తనకొరకే పుట్టిందని
తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకి
వేదించే దూరమంత కరిగేలా విరహాల విల్లు ఇట్టే విరిగేలా
విడిపోని బందమేదో కలిపేలా మెడలోన వాలనుంది వరమాల
ప్రాయం పొంగే పాలకడలి అలలా
||పండు వెన్నెల్లో||
.
.
(Contributed by Priyanka) |
Highlights
Exhilerating stuff of the highest order from the master!
Savour it thoroughly!
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
May 14th, 2010 at 7:23 pm
… వేదించే దూరమంత కరిగేలా విరహాల విల్లు ఇట్టే విరిగేలా
విడిపోని బందమేదో కలిపేలా మెడలోన వాలనుంది వరమాల…
అద్భుతమయిన భావం !