|
Context
Song Context:
నీ గుండెల్లో వాలానమ్మ చిరునామా లేక
ఏ శూన్యంలో విహరిస్తుందో నువు పంపిన లేఖ
ఎవరు చెబుతారే ఆరాటమా!
|
Song Lyrics
||ప|| |అతడు|
నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా
వేణువై రమ్మనే రాగమా
రెప్పల్లో పూలతోట రేపన్నది చూడకుండా
వేకువై ఆపితే న్యాయమా
ఇకనైనా మరపురావేల మాయమైన క్షణమా
నీడై నా వెంట రాకిలా మాయదారి నిజమా
.
||చ|| |అతడు|
ముందే చూడక పదమందే నిలవక
మనసేమీ ఆలోచించక
గమనించే లోగా గమ్యం దాటాక
వెనుతిరిగే వీలే లేదుగా
నీ గుండెల్లో వాలానమ్మ చిరునామా లేక
ఏ శూన్యంలో విహరిస్తుందో నువు పంపిన లేఖ
ఎవరు చెబుతారే ఆరాటమా
||నిద్దర్లో నీ వెంట||
.
||చ|| |అతడు|
తానే నేరుగా సావాసం సావాసం కోరగా
దరిచేరిందే అభిసారిక
చెయ్యందుకోగా సందేహించాక
తెరమరుగై పోదా తారకా
ఏం పొందాలనుకుందో హృదయం గుర్తించే ముందే
వెతికే వరమే ఎదురై వచ్చి వెళ్లిపోయిందంటే
నేరం నాదేనా అదృష్టమా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
May 31st, 2010 at 10:58 am
` …ఏం పొందాలనుకుందో హృదయం గుర్తించే ముందే
వెతికే వరమే ఎదురై వచ్చి వెళ్లిపోయిందంటే …’
very touching … and taking the soul to some where else…