|
Context
Song Context:
పగలైందని కదిలించకు మొదలైన పరవశమా!
|
Song Lyrics
||ప|| |అతడు|
నీ మౌనం తనేదో అంటోందే
నా ప్రాణం వినాలనుకుంది అదే
|ఆమె|
అనాలో లేదో తెలుసుకోక ముందే
అనేశానేమో నాకు తెలియలేదే
|| నీ మౌనం ||
.
||చ|| |అతడు|
అడిగాననీ వినిపించుకు మది చాటు మృదురాగమా
|ఆమె|
ఇంతేననీ అనిపించుకు బ్రతుకంతా ప్రియభావమా
|అతడు|
స్వరాలేవి పాడని సంగీతం తడి పెదవుల్లో చూస్తుంటే
|| నీ మౌనం ||
.
||చ|| |ఆమె|
ఈ హాయిని కరిగించకు కలగన్న కలవరమా
|అతడు|
పగలైందని కదిలించకు మొదలైన పరవశమా
|ఆమె|
పదాలేవి రాయని సందేశం జతలో చదువుతూ ఉంటే
|| నీ మౌనం ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)