|
Context
Song Context:
కనులడగని కలలను వెతికే కలవరమా!
A logic-packed self debate!
|
Song Lyrics
||ప|| |అతడు|
ఎందుకో ఎటో తెలియనితనమా || 2 ||
అలవాటుగా ఆటగా దూకే ఆత్రమా
కనులడగని కలలను వెతికే కలవరమా
.
||చ|| |అతడు|
నీ పంతం నీదే కాని పట్టలేని పరుగా
నీ పాదం నీతో చెప్పి సాగుతున్నదా
ఏ మాత్రం నీవి కాని జ్ఙాపకాల వెంట
ఏదైనా మంత్రం నిన్ను లాగుతున్నదా
కుదురుగ ఉండవే గడియైనా
అడగని ప్రశ్నలే తరిమేనా
బదులుగ చూపదే ఎవరున్నా
వెలగని దీపమే వెతికేనా
తెల్లార్లు ఇలా ఆరాటపడే పరువంలో
|| ఎందుకో ||
.
||చ|| |అతడు|
ఇచట ఉండలేని పిల్లగాలినడుగు
ఏ తోట సొంతమని చెప్పలేదుగా
తానుండే గూడేదంటే గుర్తే లేని గువ్వకు
ఆకాశం కిందికొచ్చి చూపలేదుగా
దొరకని నింగిపై ఎగరాలా
కరగని నేలపై నిలవాలా
తరగల ఊయలై ఊగాలా
తరగని దాహమై రగలాలా
తేలేది ఎలా తుళ్లింతలయ్యే తొందరలో
|| ఎందుకో ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)