|
Context
Song Context:
నీ చెలిమి వేలికొన నడుపుతున్న ఎదనే అడిగి బదులే వినుమా!
|
Song Lyrics
||ప|| |ఆమె|
కుశలమా ఓ నేస్తమా అని పిలిచిందోయమ్మా
గుమ్మం లో చిలకమ్మా
అతడు :
పదిలమే పసి పరువమా అల్లరి చాలమ్మా
వెల్లువయే కులుకమ్మా
ఆమె :
ఈ సరదా నీ మహిమ కాదనడం నా తరమా
అతడు :
రెక్క విడే పావురమా ఎక్కడికే సంబరమా
ఆమె :
నీ చెలిమి వేలికొన నడుపుతున్న ఎదనే అడిగి బదులే వినుమా
||కుశలమా||
.
చరణం : ఆమె :
పగటి పూటే నిదురలేచే కలలు కంటున్నా
అతడు :
నెమలి ఆటై పురులు విరిసే కళలు చూస్తున్నా
ఆమె :
దారంతా పుప్పొళ్ళు గారంగా పొత్తిళ్ళు అల్లి
లాలించే పూల తోట
అతడు :
ఏళ్ళన్నీ వెనక్కి వెళ్ళి పారాడే పాపల్ని మళ్ళీ
కేరింతలాడమన్నా
ఆమె :
నువు నా వెంటే ఉండంటే నీ కన్ను
ఏ ఆపదా ఆపదే నన్ను
అతడు :
నీ కంట ఈనాడిలా నేను
సరికొత్త వెలుగేంటో చూసాను
ఆమె :
పసిడి కాంతులతో పలకరించు ఉదయం ఒడిలో పులకించాను
||కుశలమా||
.
చరణం : అతడు :
ఎగిసి దూకే సొగసు వాగా పయనమెందాకా
ఆమె :
అలల పటై మనసు మీటే కడలి ఒడిదాకా
తారంగమాడుతుంటే
అతడు :
ఇన్నాళ్ళూ సంకెళ్ళు తెగి గుండెల్లో మౌనాలు రేగి
రాగాలు పాడుతుంటే
ఆమె :
ఈ వింత కవ్వింతలో తూలి నీ వంత పాడింది ఈ గాలి
అతడు :
రమ్మంది రంగేళి పూదారి పొంగింది ఊహల్లో గోదారి
ఆమె :
అదుపులేని ఆనందమేదో ఎదురై పిలిచే నీ జత కోరి
||కుశలమా||
.
.
(contributed by ఆచళ్ళ శ్రీనివాసరావు) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)