జెండా: ఎక్కడరా ఎక్కడరా ఎక్కడుంది కంట పడక వేకువ రేఖ

Audio Song:
 
Movie Name
   Jenda
Song Singers
   S.P. Balu
Music Director
   Vandemataram Srinivas
Year Released
   2002
Actors
   Ajju,
   Akruthi
Director
   Kodi RamaKrishna
Producer
   K. Satya Murthy

Context

Song Context:
    బోలోరే బోలోరే బోలోరే భాయ్
    ఇన్సాఫ్ కహా హై బోల్ రే భాయ్!

Song Lyrics

||ప|| |అతడు|
       ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ…    
       ఎక్కడరా ఎక్కడరా ఎక్కడుంది కంట పడక వేకువ రేఖ
       ఎందుకు ఈ వెతుకులాట చీకటి వెనుక ||ఎక్కడుంది||
       కత్తిమీద సామయింది ఖాఖీ కర్తవ్యం
       నెత్తిమీద పామయింది ఖాధీ దౌర్జన్యం
       కళ్ళు తెరిచి ఈ నిజాన్ని… కళ్ళు తెరిచి ఈ నిజాన్ని చూసేదాకా
       మొద్దు నిదర నుంచి జనం లేచేదాకా
       బాధ్యత గుర్తించి బదులు ఇచ్చే దాకా
       గర్జిస్తూ వుంటుంది ఈ పొలికేక… ఈ పొలికేక
       బోలోరే బోలోరే బోలోరే భాయ్
       ఇన్సాఫ్ కహా హై బోల్ రే భాయ్
                                     ||బోలోరే||
.
చరణం:
       వందకోట్ల మంది జనం అంధులయిన సమయం -
       బంధిపోట్ల బంధువైంది గాంధారి న్యాయం||వంద|
       సాక్ష్యాలే చెరుపుకుంటే లక్ష్మణ రేఖ
       సత్యం కాపాడేందుకు స్వేచ్ఛే లేక
       చెద పట్టిన చట్టం తన పక్షం కాగా
       రెక్క తెగిన పక్షయింది రక్షణ శాఖ
       అధర్మాన్ని ఇదేమిటని ఎదిరిస్తే దోషమా ||2||
       అందుకు నువు చేసే సన్మానమిదా దేశమా ||2||
       బోలోరే బోలోరే బోలోరే భాయ్
       ఇన్సాఫ్ కహా హై బోలోరే భాయ్
                                      ||బోలో రే||
                                      ||ఎక్కడరా ||
.
చరణం:
       పొట్ట కూటి కొలువు కాదు పోలీసుద్యోగం
       పొద్దుపోని ఆట కాదు మా ప్రాణ త్యాగం ||పొట్టకూటి||
       నీతికి నిర్భీతికి ఏ విలువా లేక
       నిజాయితీనేచోటా నిలబడనీక
       పట్టపగలే వేటాడితే రక్కసి మూక
       పట్టనట్టు సంఘం చూస్తోంది వేడుక
       ఈ మా బలిదానం నీ సానుభూతి కోసమా ||2||
       జాలిచూపి జారిపోకు జాగ్రత్త సమాజమా ||2||
       బోలోరే బోలోరే బోలోరే భాయ్
       ఇన్సాఫ్ కహా హై బోలోరే భాయ్
                                        ||ఎక్కడరా||
.
.
            (contributed by ఆచళ్ళ శ్రీనివాసరావు)

Highlights

…………………………………………………………………………………………………

6 Responses to “జెండా: ఎక్కడరా ఎక్కడరా ఎక్కడుంది కంట పడక వేకువ రేఖ”

  1. achalla srinivasarao Says:

    పల్లవి : ||ఆమె|| కాదు ||అతడు|| అని వుండాలి
    తర్వాత `ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ‘ అని వుండాలి
    మొదటి చరణం లో మూడవ వరుస లో మొదటి పదం `సాక్ష్యలే’ అనివుండాలి సాక్ష్యాలు కాదు. sorry

  2. Sudhir Ganti Says:

    Lyrics addiray…

    Polikeka ante ento…cheppandi sir..nijanga naaku theleedu..

    E prasna ki samadhanam thelisina varu ivvachu…nenu SSS garini nenu thapppu pattatledu…

  3. admin Says:

    Srinivasa Rao garu,
    Thanks for the corrections. Fixed them.

  4. Sai Manda Says:

    looking for this song since a long time…thank you very much for the same…

  5. admin Says:

    Sudhir gaaru:
    పొలికేక means “loudest shout”. ఊరి పొలిమేర వరకు వినపడేంత కేక is probably the origin.
    Hope it helps.

  6. Praveen Bhamidipati Says:

    The transcribed text in the post has:
    `సాక్ష్యలే’

    I might be mistaken, but audio has SPB singing:
    ‘సాక్ష్యాలే’ (with deergham and this one is appropriate)

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)