Posted by admin on 4th June 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song! |
Song Lyrics
||ప|| |అతడు|
కిలకిలమనే కళావర్ రాణి ఘల్లు ఘల్లుమనే కథాకళి కానీ
కళ్లెం లేని కళ్లల్లోని కవ్వింతల్ని హలో అని
|ఆమె|
చల్ మోహనాంగ సుఖాలకు బోణీ
చలి గిలి అన్ని పొలోమని పోని సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలొ హనీ
|అతడు|
మదనుడి పాలైపోనీ ముదిరిన భావాలన్నీ
|ఆమె|
మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ
|| కిలకిలమని ||
.
||చ|| |అతడు|
బరువుగా విరివిగా కాపు చూపే కదా ఏపుగా గోపిక
|ఆమె|
చొరవగా కరువుగా కాటువేసె కదా కైపుగా కోరికా
|అతడు|
వాలే పరువాలే తగువేలే గనుకా
|ఆమె|
కాలే తమకాలే గమకాలై పలుకా
|అతడు|
కాంక్షలో సృతీ గతీ పెంచి కాల్చదా చుట్టూ కట్టే కంచె ఈ మైకం
ఈడులో అతి గతి లేని వేడికో దిక్కు మొక్కు పంచే ఏం ఆగం
|అతడు|
ఆదమరచిన ఈడులో ఈతలాడనీ
||చల్ మోహనాంగా||
.
||చ|| |ఆమె|
ఒడుపుగా ఒలుచుకో ఓపలేను కద ఒంటిలో అవసరం
|అతడు|
చిలిపిగా దులుపుకో మోయలేవు కద నడుములో కలవరం
|ఆమె|
తాపం తెరతీసి తరిమేసే తరుణం
|అతడు|
కాలం తలుపేసి విరవూసే సమయం
|ఆమె|
వీలుగా గుట్టూ మట్టు మీటి లీలగా ఇట్టే పుట్టే వేడి ఏడేడో
|అతడు|
ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ వెంటనే జట్టే కట్టేయ్యాలి ఏమీడో
|ఆమె|
జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ
|| కిలకిలమని ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)