|
Context
Song Context:
జై గణేష song + teasing song!
|
Song Lyrics
||ప|| |అతడు|
జైజైజైజై గణేష జైజైజై
జైజైజై వినాయకా జైజైజై
కోరస్ : ||జైగణేష||
అతడు:
దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయా చూపించయ్యా తోవా
పిండివంటలారగించి తొండమెత్తి దీవించయా
తండ్రివలె ఆదరించి తోడునీడ అందించయా
||దండాలయ్యా|
.
చరణం: అతడు:
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
- పాపం కొండంత నీ పెను భారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హో హో హో జన్మధన్యం
||చిన్నారి ఈ||
అంబారిగా ఉండగల ఇంతటి వరం
కోరస్: హయ్యేర హయ్యా
అతడు:
అంబాసుతా ఎందరికి లభించురా
కోరస్: హయ్యేరా హయ్యా
అతడు:
ఎలుకనెక్కే ఏనుగు కథా చిత్రం కదా
||దండాలయ్యా||
.
చరణం: అతడు:
శివుని శిరసు సిమ్హాసనం పొందిన చంద్రుని గోరోజనం - నిన్నే చేసింది వేళాకోలం
ఎక్కిన మధం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఎమైపోయింది గర్వం
||శివుని సిరసు||
త్రిమూర్తులే నినుగని తలొంచరా
కోరస్ : హయ్యేర హయ్యా
అతడు:
నిరంతరం మహిమలు కీర్తించరా
కోరస్ : హయ్యేర హయ్యా
అతడు:
నువ్వేంతనే అహం నువే దండించరా
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
A classic example of how to write a dual meaning song! Amazing precision!
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 6th, 2011 at 5:15 am
One of the best devotional song, yet with a mass appeal. Sastry Garu, Ilaiyaraja and SP Balasubrahmanyam is a great combo.
Happy Ganesh festival to all.
December 26th, 2011 at 1:31 am
The best line in the song “ఎలుకనెక్కే ఏనుగు కథా చిత్రం కదా” typical Sastry gaari style. Hatsoff sir.