అంకురం: కలకాలం కలిసుంటానంటే — ఔనేమో అనుకున్నానంతే

Audio Song:
 
Movie Name
   Ankuram
Song Singers
   Chitra,
   Chorus
Music Director
   Hamsa Lekha
Year Released
   1992
Actors
   Revathi,
   Om Puri
Director
   C. UmaMaheswara Rao
Producer
   K.V. Suresh Kumar

Context

Song Context:
     కలకాలం కలిసుంటానంటే - ఔనేమో అనుకున్నానంతే
     నిజమా అనిపించే కలలే కన్నా - కలగా కనిపించే నిజమై వున్నా!

Song Lyrics

||ప|| |అతడు|
       కలకాలం కలిసుంటానంటే - ఔనేమో అనుకున్నానంతే ||2||
       నిజమా అనిపించే కలలే కన్నా - కలగా కనిపించే నిజమై వున్నా
       కనుమరుగై నువు కరిగేవేళ - గుడ్ బై!గుడ్ బై!గుడ్ బై!
                                             ||కలకాలం||
.
చరణం:
       వెలుగంటే విషమంటూ పగలంటే పడదంటూ
       నిదురిస్తూ వుంటేనే జతవుంటానన్నావే
       తొలికిరణం కనబడితే ఒక నిముషం నిలబడవే
       వెయ్యేళ్ళు కనుమూసి బతికేదెలా
       చిరువేడి చురకలకే చెదిరే కలా
                                              ||కలకాలం||
.
చరణం:
       ఏడేడు జన్మాలు ముడివేసే బంధాలు
       చిత్రించే చైత్రాలు వర్ణించె స్వర్గాలు
       ఎద చూసే స్వప్నాలా, శిధిలమయే సత్యాలా?
       హృదయాన నలుపున్న జతజాబిలి
       తెలుపంటే తలుపేసె నీ లోగిలి
                                                ||కలకాలం||
.
.
                       (Contributed by Venkata Sreedhar)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)