|
Context
Song Context:
|ఆమె|
గుండెచాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరిక
ఉన్నపాటుగా ఆడపుట్టుక కట్టుబాటు దాటలేదుగా
|అతడు|
కన్నెవేడుక విన్నవించగా అందుబాటులోనే ఉన్నానుగా
తీగచాటుగా మూగపాటగా ఆగిపోకే రాగమాలిక |
Song Lyrics
||ప|| |ఆమె|
వేసంకాలం వెన్నెల్లాగ వానల్లో వాగుల్లాగా వయసు ఎవరి కోసం
శీతకాలం ఎండల్లాగ సంక్రాంతి పండగలాగ సొగసు ఎవరి కోసం
ఓరోరి అందగాడ నన్నేలు మన్మథుడా
నీ కోసం నీ కోసం నీ కోసం ||2||
|అతడు|
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండగ చేసే సందడి వేళ ఆకువక్క సున్నం
నీ కోసం నీ కోసం నీ కోసం ||2||
.
||చ|| |ఆమె|
గుండెచాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరిక
ఉన్నపాటుగా ఆడపుట్టుక కట్టుబాటు దాటలేదుగా
|అతడు|
కన్నెవేడుక విన్నవించగా అందుబాటులోనే ఉన్నానుగా
తీగచాటుగా మూగపాటగా ఆగిపోకే రాగమాలిక
|ఆమె|
నిలువెల్లా నీ జతలోన చిగురించు లతనై రానా
|అతడు|
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలి వీణ
|ఆమె|
అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చే సోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం
నీ కోసం నీ కోసం నీ కోసం ||2||
.
||చ|| |అతడు|
సిగ్గుపోలిక నెగ్గలేవుగా ఏడుమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయగా మోయలేవుగా లేతసోయగాల భారమా
|ఆమె|
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగుబంగారమా
తాళిబొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమతీరమా
|అతడు|
మునిపంటి ముద్దరకానా చిగురంటి పెదవులపైన
|ఆమె|
మురిపాల మువ్వను కోనా దొరగారి నవ్వులలోనా
|అతడు|
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్ ముద్దరలేని పద్ధతిలోనే ముద్దుల్నెన్నో తెచ్చా
నీ కోసం నీ కోసం నీ కోసం ||2||
||వేసంకాలం వెన్నెల్లాగ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
An out-and-out deeply romantic song, yet what a class act that is!
Phew! Give me a break! Nowhere it went beyond the limits, I guess!
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)