|
Context
Song Context:
వేణుమాధవా నీ సన్నిధి… చేరనీ.. |
Song Lyrics
||ప|| |ఆమె|
వేణుమాధవా… వేణుమాధవా
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో||2||
ఏ మోవిపై వాలితే మౌనమేమంత్రమవుతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరనీ మాధవా
|| ఏ శ్వాసలో చేరితే ||
.
||చ|| |ఆమె|
మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ
వెనుకటి బతుకున చేసిన పుణ్యమిదా
తనువును నిలువుగ తొలిచిన గాయములే తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధి…
|| ఏ శ్వాసలో చేరితే ||
.
||చ|| |ఆమె|
చల్లని నీ చిరునవ్వులు కనపడక
కనుపాపకీ… నలువైపుల నడిరాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగుల సడి వినబడక
హృదయానికీ… అలజడితో అణువణువు తడబడదా
నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధీ….
.
||సాకీ||
రాధికా హృదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి…
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
What a creative way of worshipping the God, వేణుమాధవా! i.e., to reach the వేణుమాధవుని సన్నిధి.
Pallavi and the first Charanam are centered on “మురళి”.
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో => in మురళి
ఏ మోవిపై వాలితే మౌనమేమంత్రమవుతున్నదో => మురళి
ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరనీ మాధవా!
.
మునులకు తెలియని జపములు జరిపినదా!
తనువును నిలువుగ తొలిచిన గాయములే తన జన్మకీ!
.
One of the sweetest of its kind in every aspect!
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
June 13th, 2010 at 8:09 pm
this is one of the best songs I listen very frequently. I forget all my stress, when I listen to Sirivennela songs, as it has strong inherent meaning which heals the mind.