|
Context
Song Context:
వెంటనే పోల్చాను నీ చిరునామా… ప్రేమా!
|
Song Lyrics
||ప|| |అతడు|
గుండెనిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళనిండా సంక్రాంతులు సంధ్యాకాతులు శుభాకాంక్షలంటే ..
వెంటనే పోల్చాను నీ చిరునామా… ప్రేమా…
||గుండెనిండా||
.
||చ|| |అతడు|
చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా
నిలువెల్లా మారిపోయా నేనే నీ నీడగా
నిలువదు నిముషం నువు ఎదురుంటే
కదలదు సమయం కనబడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా…
||గుండెనిండా||
.
||చ|| |అతడు|
నీ పేరే పలవరించే నాలోని ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఎన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని
ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని
నీ జతలో క్షణమైనా బ్రతుకుని చరితగ మార్చేస్తుందమ్మా…
||గుండెనిండా||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
Conceptually one of the best descriptions of “ప్రేమ” - deeply immersed in భారతీయత - presented at a highest plane yet “ever so simplistically”!
.
Seemingly the following two lines:
నిలువదు నిముషం నువు ఎదురుంటే
కదలదు సమయం కనబడకుంటే
appear to be repetition of another Sirivennela gaari song మన్మధుడు: గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది with the lines:
|అతడు|
నిలవదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
|ఆమె|
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
However, I reckon, the later is a duet - presented in a two-way conversation - at a shade lower plane even though with sweet poetry!
.
Regardelss savour the complete lyrics!
.
Also compare this song with
నువ్వొస్తానంటే నేనొద్దంటానా: ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల presented perhaps @ THE highest plane and conceptually with unbelievable depth and complexity; & thought-provoking with its intricate utility value!
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
August 2nd, 2010 at 4:57 am
Just one minor correction here i guess,
నీ పేరే పలవరించే నాలోని ఆశలు should be
నీ పేరే కలవరించె నాలోని ఆశలు.
Thanks,
Sri Harsha.
August 2nd, 2010 at 3:34 pm
I guess there is little difference between them if at all. May be పలవరించే is colloquial. Singer seems to say పలవరించే though. So I am keeping it as is.
If you still believe పలవరించే is wrong, let us know. I will verify it with Sirivennela garu.