నువ్వొస్తానంటే నేనొద్దంటానా: ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల

Posted by admin on 11th September 2009 in ప్రేమంటే

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nuvvostanante
     Nenoddantana

Song Singers
   S.P. Balu
Music Director
   DeviSri Prasad
Year Released
   2005
Actors
   Siddharth, Trisha
Director
   Prabhu Deva
Producer
   M.S. Raju

Context

Song Context:
              ప్రేమంటే !

Song Lyrics

||ప|| |ఖోరస్|
       ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్
|అతడు|
       ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
                   అందించే ఆహ్వానం ప్రేమంటే
       ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
                   వినిపించే తడిగానం ప్రేమంటే
       అణువణువును మీటే మమతల మౌనం
             పదపదమంటే నిలవదు ప్రాణం
                   ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
       దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
                   స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
       మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
                   మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
                                             |ఖోరస్| ||ఘల్ ఘల్||
.
||చ|| |అతడు|
       ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో
                                గుర్తించేందుకు వీలుందా
       ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో
                                గమనించే సమయం ఉంటుందా
       ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
       అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
                                సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
       దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
                   తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే
       సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
                   తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
                                            |ఖోరస్| ||ఘల్ ఘల్||
.
||చ|| |అతడు|
       మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది
                                స్వర్ణమంటు చూపాలంటే
       పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి
                                పోటే చేసిన మేలంటే
       తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే
                                ప్రియురాలే గెలుపంటే
       తను కొలువై ఉండే విలువే ఉంటే
                    అలాంటి మనసుకు తనంత తానే
                           అడగక దొరికే వరమే వలపంటే
       జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే
                   నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
       రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే
                   ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
                                            |ఖోరస్| ||ఘల్ ఘల్||
.
.
                              (Contributed by Nagarjuna)

Highlights

Vintage Sirivennela in roaring form!
A PhD dissertation by Sirivennela on ప్రేమంటే!
Indescribable! I will leave it there!
.
Also Compare this song with this lighter meal: పెళ్ళి సందడి: హృదయమనే కోవేల తలుపులు తెరిచే తాళం ప్రేమా
……………………………………………………………………………………………

14 Responses to “నువ్వొస్తానంటే నేనొద్దంటానా: ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల”

  1. Praveen Bhamidipati Says:

    I have been listening to this song for years but couldn’t get that it was “Mande Kolimi”. Thanks a lot to you for that.

  2. admin Says:

    Appreciate your feedback. Glad to be of help!

  3. Suman Says:

    “Indescribable” is the apt word for love as well but guruji explained it so clearly that there will be no second thought in the listener’s mind.

    “దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
    స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
    మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
    మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే” What else can you say.

    Can any one tell when love blossoms in a heart?

    “దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
    తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే
    సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
    తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే” It doesn’t get any better.

    Finally.
    “జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే
    నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
    రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే
    ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా”
    When ever I listen to this phrase I get goose bumps. The thought itself is so lovely. Especially the first two lines. Phenomenal!!!

  4. Sri Harsha Says:

    Please add this bit song to the same thread…Couldn’t find it anywhere…

    పాదం కదలనంటుందా
    ఎదురుగ ఏ మలుపుందొ కాలం ముందే చూపందే…

    దూరం కరగనంటుందా
    తారలను దొసిట పట్టే ఆశలు దూసుకు పొతుంటే…

    లొతెంతో అడగననే పదవల్లే అడుగెస్తే
    దారీయను అంటుందా కడలైనా

    తను కలలుగ మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచె నిమిషం కొసం
    దిశలను తరిమె ఉరుమె ప్రెమంటె…

    నూవ్వే తన ఐదొతనమని నీకై నొచె నొముంటే
    నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా!
    తానే నీ పెదవులపై చిరునవ్వై చిలికే ప్రెముంతీ
    ఆ తీపికి విషమైనా అమ్రుతమే ఐపొదా!!

  5. Sri Harsha Says:

    Apologies.. Just did not find the right search words.. You can ignore/delete my comment..

  6. Maruthi Podila Says:

    Hats off Sastry garu…

  7. admin Says:

    @Suman
    Thank you very much for sharing your impressions in detail. One of the objective of this site is to exchange everyone’s views with the rest of the folks.
    Please keep them coming!

  8. admin Says:

    @Sri Harsha,
    Appreciate the complete lyrics of the song. The best way to search the site is with words in telugu script like “పాదం కదలనంటుందా” rather than “padam kadalananutunda” or may be “paadam kadalanantundaa” etc….
    Telugu script eliminates the ambiguity that is inherent in english’s spelling idiosyncrasies.
    The complete lyrics of నువ్వొస్తానంటే నేనొద్దంటానా: పాదం కదలనంటుందా is @ http://www.sirivennela-bhavalahari.org/?p=3694

  9. varun Says:

    “దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
    స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే

    In the first line, can any one tell me what “చివురుకు” means

  10. Sri Harsha Says:

    @ Varun,

    చివురు can be understood as a tender seed here…

    It just means that although there is no relation between rain and a seed, it helps the seed to become sprout… the affection between these two is love, per guruji…

    ఒక పక్కన “ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే” అంటూనే, ప్రేమంటే ఎంటో చెప్పటం గురువు గారికే చెల్లింది.

  11. Sistla Chandra Sekhar Says:

    Most idiotic movie. But I must say this is a great song, thanks to Sastry Garu.

  12. hyder Says:

    Thnk u sir
    but meeru songs ku meaning telugulo explain cheste baavuntundi..
    Endukante
    avi telugugulo aite ne artham chesukogalam

  13. hyder Says:

    Anta goppa meaning nu english lo corect ga explain chese words undavu..

  14. Chandu Says:

    Wow!!! What a song this is! No words to explain the feeling after listening to this song.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)