Archive for the ‘ప్రేమంటే’ Category

నువ్వొస్తానంటే నేనొద్దంటానా: ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల

Posted by admin on 11th September 2009 in ప్రేమంటే

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nuvvostanante
     Nenoddantana

Song Singers
   S.P. Balu
Music Director
   DeviSri Prasad
Year Released
   2005
Actors
   Siddharth, Trisha
Director
   Prabhu Deva
Producer
   M.S. Raju

Context

Song Context:
              ప్రేమంటే !

Song Lyrics

||ప|| |ఖోరస్|
       ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్
|అతడు|
       ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
                   అందించే ఆహ్వానం ప్రేమంటే
       ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
                   వినిపించే తడిగానం ప్రేమంటే
       అణువణువును మీటే మమతల మౌనం
             పదపదమంటే నిలవదు ప్రాణం
                   ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
       దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
                   స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
       మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
                   మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
                                             |ఖోరస్| ||ఘల్ ఘల్||
.
||చ|| |అతడు|
       ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో
                                గుర్తించేందుకు వీలుందా
       ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో
                                గమనించే సమయం ఉంటుందా
       ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
       అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
                                సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
       దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
                   తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే
       సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
                   తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
                                            |ఖోరస్| ||ఘల్ ఘల్||
.
||చ|| |అతడు|
       మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది
                                స్వర్ణమంటు చూపాలంటే
       పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి
                                పోటే చేసిన మేలంటే
       తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే
                                ప్రియురాలే గెలుపంటే
       తను కొలువై ఉండే విలువే ఉంటే
                    అలాంటి మనసుకు తనంత తానే
                           అడగక దొరికే వరమే వలపంటే
       జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే
                   నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
       రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే
                   ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
                                            |ఖోరస్| ||ఘల్ ఘల్||
.
.
                              (Contributed by Nagarjuna)

Highlights

Vintage Sirivennela in roaring form!
A PhD dissertation by Sirivennela on ప్రేమంటే!
Indescribable! I will leave it there!
.
Also Compare this song with this lighter meal: పెళ్ళి సందడి: హృదయమనే కోవేల తలుపులు తెరిచే తాళం ప్రేమా
……………………………………………………………………………………………