|
Context
Song Context:
ఈ ప్రేమ! |
Song Lyrics
||ప|| |ఆమె|
హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా.. ప్రేమా..
||ఖోరస్||
ప్రేమా.. ప్రేమా
|అతడు|
త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమా.. ప్రేమా..
||ఖోరస్||
ప్రేమా.. ప్రేమా
|ఆమె|
అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ
|అతడు|
తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ
|ఆమె|
గగనానికి నేలకి వంతెన వేసిన వాన విల్లు ఈ ప్రేమ
||ఖోరస్||
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
||హృదయమనే ||
.
||చ|| |ఆమె|
ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ తన కొరకు ఏ సిరిని అడగదు కదా
|అతడు|
నవ్వడమే చూపగల ఈ ప్రేమ - మంటలనే వెన్నెలగా మార్చును కదా
|ఆమె|
గాలికి గంధము పూయడమే పూలకు తెలిసిన ప్రేమ సుధ
|అతడు|
రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమ కథ
|ఆమె|
ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమ
||ఖోరస్||
ప్రేమా..ప్రేమా..ప్రేమా..ప్రేమా
||హృదయమనే ||
.
||చ|| |అతడు|
ఏ జతనో ఎందుకో విడదీసి వెంటాడి వేటాడు ఆటే ప్రేమ
|ఆమె|
మౌనముతో మనసునే శృతి చేసి రాగాలు పలికించు పాటే ప్రేమ
|అతడు|
శాశ్వత చరితల ఈ ప్రేమ మృత్యువు ఎరగని చిరునామా
|ఆమె|
శ్వాసను మంగళ హారతిగా వెలిగించేదే ఈ ప్రేమ
|అతడు|
మరణాన్ని ఎదిరించి…
|ఆమె|
మరణాన్ని ఎదిరించి… మరుజన్మగా వచ్చి… ||2||
కరుణించు వరమే ప్రేమ
.
||ఖోరస్||
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
||హృదయమనే ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
1995 Manaswini Award Winner!
1995 Kalasagar Award Winner!
.
A simple line by line english translation follows:
.
It is the love - the lock that opens the door to the temple of heart!
It is the love - the glowing light at the presence/feet of the goddess of sacrifice!
It is the love - that dedicates every bit of oneself to friendship!
It is the love - that self-burns by propogating light to the surroundings!
It is the love - that forms “rain”bow bridging the sky to the earth!
.
This love teaches only “giving”, but never asks any gold for itself!
This love presents “smiles” by converting the flames into moonlight!
The సుధ of love - is the fragrance that the flowers spray into the air!
This love story - is the reminiscence to the future as the story of fallen flowers!
This love - is the character of enjoying onself by wishing peace & prosperity to loved ones!
.
This game of love - for unknown reasons hunts & haunts by separating lovers!
This love - is the song that produces “raagas” by tuning the mind with “silence”.
This love - is the address that never dies & remaining in the history forever!
This love - glows “our breath” as మంగళ హారతి!
This love - by successfully fighting against “the death” comes as the kind boon as rebirth!
.
Also Compare this song with (perhaps the most powerful and deeper description about “love” in human history!): నువ్వొస్తానంటే నేనొద్దంటానా: ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
.
[Also refer to Pages 138 in సిరివెన్నెల తరంగాలు & pages 43-45 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)