|
Song (Male) Lyrics
Context:
After falling in love with a long-time friend, it is amost too late to express his love to her
(ప్రియతమా నీ పరిమళం ఒక ఊహేగా, నీఊపిరిగ సొంతం కాదా!)
.
||ప|| |అతడు|
ఎపుడూ నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది
|| ఎపుడూ ||
.
||చ|| |అతడు|
ఙాపకం సాక్షిగా పలకరించావు ప్రతి చోట
జీవితం నీవని గురుతు చేశావు ప్రతి చోట
ఒంటిగా బతకలేనంటూ వెంట తరిమావు ఇన్నాళ్లు
మెలకువే రాని కలగంటూ గడపమన్నావు నూరేళ్లు
ప్రియతమా నీ పరిమళం ఒక ఊహేగా నీఊపిరిగ సొంతం కాదా
.
.
(Contributed by Nagarjuna) |
Song (Female) Lyrics
Context:
After falling in love with a long-time friend, it is amost too late for him to express his love
(తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్కసారైనా!)
.
||ప|| |ఆమె|
ఎపుడూ నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది…
|| ఎపుడూ ||
.
||చ|| |ఆమె|
గుండెలో ఆశనీ తెలుపనే లేదు నా మౌనం
చూపులో భాషనీ చదవనేలేదు నీ స్నేహం
తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదరున్నా…
తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్కసారైనా
నేస్తమా నీ పరిచయం కల కరిగించేటి కన్నీటి వానే కాదా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights (Male & Female)
Yet another double header!
I changed the formatting of the page to accommodate both the versions in the same screen shot.
Follow the complete lyrics.
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)