|
Context
Song Context:
(Guess, I am in love with my long-time friend!)
ఈ తీపి దిగులు మొదలైంది మొదలూ
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా?! |
Song Lyrics
|ఖోరస్|
Are you in love?
.
||ప|| |ఆమె|
ఈనాటి వరకూ నా గుండె లయకూ
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపి దిగులు మొదలైంది మొదలూ ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
||ఈనాటి వరకూ||
అరెరె ఎన్నడూ ఈ రంగులు నేను చూడనేలేదే
ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురుకాలేదే… మనసా
||ఈనాటి వరకూ||
.
||చ|| |అతడు|
ప్రేమ అంటే ఏమిటంటే తెలిసేదాక తెలియదంతే
ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే
ఎంత మాత్రం నమ్మనంటూ నాలో నేను నవ్వుకుంటే
నన్ను సైతం వదలనంటూ వచ్చి కమ్ముకుందే
కథలు విన్నా ఎదరే ఉన్నా అసలు సంగతి తేలదుగా
అనుభవంతో చెబుతూ ఉన్నా రుజువు నేనేగా
||ఈనాటి వరకూ||
.
||చ|| |అతడు|
ఒక్కచోటే కలిసి ఉన్నా తనతో పాటు ఇంతకాలం
ఒక్కపూట కలగలేదే నాకిలాంటి భావం
ఇప్పుడేగా తెలుసుకున్నా ఎగిరొచ్చాక ఇంత దూరం
ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం
కంటపడని ప్రాణం లాగా గుండెలోనే తానున్నా
ఙాపకాలే తరిమేదాకా గురుతు రాలేదే
||ఈ తీపి దిగులు ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Yet another Sirivenenla’s presentation on “I am in love with my long-time friend”. A self realization!
.
ఒక్కచోటే కలిసి ఉన్నా తనతో పాటు ఇంతకాలం
ఒక్కపూట కలగలేదే నాకిలాంటి భావం
ఇప్పుడేగా తెలుసుకున్నా ఎగిరొచ్చాక ఇంత దూరం
ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం
కంటపడని ప్రాణం లాగా గుండెలోనే తానున్నా
ఙాపకాలే తరిమేదాకా గురుతు రాలేదే
.
Also Compare this song with: సొంతం: తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక
.
And with: కొంచెం ఇష్టం కొంచెం కష్టం : ఆనందమా ఆరాటమా ఆలోచనా… ఏమిటో
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)