|
Context
Song Context:
Did I fall in love with my long-time friend?
(నిన్న దాక ఎప్పుడూ నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతమైనా అడగలేదని) |
Song Lyrics
||ప|| |ఆమె|
తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక
అడగనా అడగనా అతడినీ మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక
ఎలా ఎలా దాచిఉంచేది - ఎలా ఎలా దాన్ని ఆపేది
|| తెలుసునా ||
.
||చ|| |ఆమె|
అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది
పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకో
ఇంత వరకు లేదుగా ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక
అడగనా అడగనా అతడినీ మెలమెల్లగా
.
||చ|| |ఆమె|
గుండెలోతుల్లో ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతని తలపే నిండిపోయుంది
నిన్న దాక ఎప్పుడూ నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతమైనా అడగలేదని
.
||చ|| |ఆమె|
తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక
అడగనా అడగనా అతడినీ మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక
ఎలా ఎలా దాచిఉంచేది - ఎలా ఎలా దాన్ని ఆపేది
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా…
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Did I fall in love with my long-time friend?
A fascinating self-debate!
An unprecedented presentation of its kind/content, it must be!
A Sirivennela’s special!
.
గుండెలోతుల్లో ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతని తలపే నిండిపోయుంది
నిన్న దాక ఎప్పుడూ నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతమైనా అడగలేదని
.
Also Compare this song with: సొంతం: ఈనాటి వరకూ నా గుండె లయకూ
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)