ఈశ్వర్: అమీర్పేటకి ధూల్పేటకి షహరొకటే రా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Eshwar
Song Singers
   R.P. Patnaik
Music Director
   R.P. Patnaik
Year Released
   2002
Actors
   Prabhas,
   Sri Devi
Director
   Jayant C. Paranji
Producer
   A. Ashok Kumar

Context

Song Context:
     కార్లకైనా కాళ్లకైనా సడకొకటే రా!
     ఎవడి కలల కోటకి మహరాజు వాడేరా!

Song Lyrics

||ఖోరస్||
ధం ధమాధం ఢోల్ బజా షోర్ మచా
ధన్ ధనాధన్ చెయ్ రా చిచా మస్త్ మజా
||ప|| |అతడు|
       అమీర్పేటకి ధూల్పేటకి షహరొకటే రా
       కార్లకైనా కాళ్లకైనా సడకొకటే రా
       ఎవడి కలల కోటకి మహరాజు వాడేరా
       ఎగిరిపడే నవాబ్గిరి చెల్లదు పోరా
       అరె చల్ బే తెగ డబ్బుందని కళ్లు నెత్తికెక్కితే చెడతవు భయ్
       మరీ ఫోజేస్తే మా దమ్ముతో నీ దుమ్ముని దులిపితే దిక్కెవడోయ్
                                  ||ధం ధమాధం||   ||అమీర్పేటకి ||
.
||చ|| |అతడు|
       దేవుడైనా మనలా ధీమాగా తిరగగలడా కోవెలొదిలి వీధిలోపడి
       చిరంజీవి అయినా సినిమాలు చూడగలడా మొదటి ఆట క్యూలో నిలబడి
       బోనాల్ జాతరలో చిందులెయ్యగలరా
       హోలీ రంగులతో తడిసి నవ్వగలరా
       గొప్ప గొప్ప వాళ్లెవరైనా
                                     ||ధం ధమాధం||   ||అమీర్పేటకి ||
.
||చ|| |అతడు|
       కొత్త వానలోని ఈ మట్టి సువాసనని
       ఏ అంగడి అమ్ముతుందిరా
       పాత బస్తీలోని ఈ పానీ పూరీనీ
       రుచి చూడని జన్మెందుకురా
       సొమ్ము పిలవగలదా చల్లని వెన్నలనీ
       ఎంతవాడు గానీ ఎంత ఉన్న గానీ
       కొనగలడా అమ్మ ప్రేమనీ
                                    ||ధం ధమాధం||  ||అమీర్పేటకి ||
.
.
                  (Contributed by Nagarjuna)

Highlights

కొత్త వానలోని ఈ మట్టి సువాసనని - ఏ అంగడి అమ్ముతుందిరా
.
సొమ్ము పిలవగలదా చల్లని వెన్నలనీ
.
ఎంతవాడు గానీ ఎంత ఉన్న గానీ - కొనగలడా అమ్మ ప్రేమనీ
…………………………………………………………………………………………………

2 Responses to “ఈశ్వర్: అమీర్పేటకి ధూల్పేటకి షహరొకటే రా”

  1. Sri Harsha Kiran.P Says:

    Hi,

    నవాబ్కిది should be నవాబ్గిరి as in Nawabgiri.

  2. admin Says:

    Thank you. Fixed it!

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)