ఈశ్వర్: ధింధిరనా ధింధిరనా అందెలు తొడిగిన పదమవనా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Eshwar
Song Singers
   Rajesh,
   Usha
Music Director
   R.P. Patnaik
Year Released
   2002
Actors
   Prabhas,
   Sri Devi
Director
   Jayant C. Paranji
Producer
   A. Ashok Kumar

Context

Song Context:
|ఆమె|
   వందేళ్ల వరమా అనుబంధాల బలమా
   మదిలో మౌనాలు తెలిపే మనవి వినుమా
|అతడు|
   అందాల వరమా సుమగంధాల స్వరమా
   అదిరే నీ గుండె బెదురే నిలుపతరమా

Song Lyrics

||ప|| |ఆమె|
       ధింధిరనా ధింధిరనా అందెలు తొడిగిన పదమవనా
       ఆశపడే సందడిగా నిన్నే పిలువనా
|అతడు|
       ధింధిరనా ధింధిరనా చిందులు నిలుపని పరుగవనా
       వెంటపడి తొందరగా నిన్నే కలవనా
       రంగుల కల కనపడెనా రమ్మని నను పిలిచేనా
       పొంగిన అలనైపోనా… ఎవరాపినా
                                     || ధింధిరనా ||
.
||చ|| |ఆమె|
       వందేళ్ల వరమా అనుబంధాల బలమా
       మదిలో మౌనాలు తెలిపే మనవి వినుమా
|అతడు|
       అందాల వరమా సుమగంధాల స్వరమా
       అదిరే నీ గుండె బెదురే నిలుపతరమా
|ఆమె|
       తొలి పొద్దులాంటి నమ్మకమా
       వదలద్దు నన్ను సంబరమా
       కదలద్దు నువ్వు ఇక ఆగిపో సమయమా
|అతడు|
       చెలి సోయగాల నందనమా
       చలి కంచె తెంచుకోవమ్మా
       చిగురించుకున్న చిరునవ్వు చెదరదమ్మా
                                     || ధింధిరనా ||
.
||చ|| |అతడు|
       ప్రాణాలు నిలిపే నా పంతాల గెలుపా
       నీదే నా బతుకు అంతా మొదటి వలపా
|ఆమె|
       నీ వెంట నడిపే గత జన్మాల పిలుపా
       నేడే నీ సొంతమవుతా మేలుకొలుపా
|అతడు|
       ఎడబాటు కంటపడనీక ఎద చాటునుండవే చిలకా
       అలవాటు పడ్డ తడబాటు మరచిపోవా
|ఆమె|
       విరహాన్ని తరిమికొట్టాక సరికొత్త మలుపు తిరిగాగా
       మురిపాలు కాస్త శృతి మించి తుళ్లిపడవా
                                   || ధింధిరనా ||
.
.
              (Contributed by Nagarjuna)

Highlights


…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)