Posted by admin on 25th June 2010 in
ముసలితనం
|
Context
Song Context:
ముసలితనం! ఒంటరి దంపతులు! వీరి కథ! (A Medley Song)
|
Song Lyrics
||ప|| |అతడు|
ఆదివారమే మనకు ప్రతివారం నిజమే ఆదివారమే మనకు ప్రతివారం
ఇది ముసలితనం మనకిచ్చిన కొత్త వరం
ఆరునెల్ల పాపలల్లె నవ్వేద్దాం పకపకలాడేందుకు పళ్ళెందుకు అనుకుందాం
బాదరబంది రెటైరైపోయింది బాధలబండి షెడ్డుకెళిపోయింది
వేళకింత తిని వాలుకుర్చీలో పడుకుని
కోడికునుకు తీసేందుకు బోలెడంత తీరికుంది
||ఆదివారమే||
.
|అతడు1|
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆర్చేరా తీర్చేరా నా బాధను ఎవరైనా
|అతడు|
అంత విచారం దేనికి తాతయ్యా
నీ వింతకథేదో వింటా చెప్పయ్యా
.
సాకీ: |అతడు1|
ఏమిటలా చెవికోసిన మేకలా ఆ..ఆ.. అంటావు
|అతడు|
మరి ఆ తర్వాత ట్యూన్ మర్చిపోయానే
|అతడు1|
దాందేముంది ట్యూన్ మార్చేస్తేసరి
|అతడు|
ఓ యస్ అలాక్కానివ్వండి
.
|అతడు|
చందురుని మించు అందమొలికించు ఆలినే కాదని
ఈ గాలి తిరుగుళ్ళు మానరా అంటు అడ్డుపడినానని
కన్నతండ్రన్న గౌరవం లేక కాలదన్నాడయా
ఆ సాని కొంగొదిలి రానుపొమ్మన్న హీనుడయ్యాడయా
.
|అతడు|
అడ్డాలనాడె కాని గడ్డాలొస్తే బిడ్డలా
గడ్డిని మేసే కొడుకు ఉన్నా ఊడినట్టే
తద్దినాలే పెట్టి ఊరుకోవయా
అడ్డాలనాడె కాని గడ్డాలొస్తే బిడ్డలా
.
|అతడు1|
నేను తాగాను మా ఆవిడ ఏడ్చింది
నేను తాగాను నా పిల్లలు ఏడ్చారు ||2||
ఇంకా తాగాను ఇక బయటకీడ్చారు
తాగందే గతిలేకా నేను ఏడ్చాను.. డ్రింక్ మోర్
.
|అతడు|
బీరు కొట్టి బజారెక్కి నాటు సారా నిషా ఎక్కి
తప్పుదారిలో తుళ్ళుతు ఉంటే ముప్పురాదా ముసలోడా ముసలోడా
|అతడు1|
కిక్కుమీద ఆ సంగతి గుర్తురాదు
|అతడు|
కాని ఒక్క నిమిషమైనా ఆ తిక్క పోదు
|అతడు1|
కైపులేనిదే ఊపిరాడదే కైపులేనిదే ఊపిరాడదే
|అతడు|
ఆ కైపు ఎక్కువైతే ఇక ఊపు ఆగదే
.
|అతడు1|
పెళ్ళమేమో బెల్లమయ్యే తల్లీదండ్రీ అల్లమయ్యే
|అతడు|
కాస్త ఆగవయ్యా ముసలాయనా
దానికి ముందు హమ్మింగుంది అది వదిలేస్తే ఎట్టాగా
|అతడు|
అయ్యయ్యో హమ్మింగ్ రూటు మారిపోయిందయ్యా
ముసలాయనా నువ్వే లాగించు కానియ్
.
|అతడు1| పెళ్ళమేమో బెల్లమయ్యే తల్లీదండ్రీ అల్లమయ్యే
|ఆమె| అల్లమయ్యే
|అతడు1| ఇల్లువెళ్ళగొట్టేసాడు చూడయ్యా
|ఆమె| చూడయ్యా
|అతడు1|
మాగోడు చెప్పుకునే దిక్కులేదయ్యా
.
|అతడు|
అయ్యయ్యో ఓ.. ఓ..
|అతడు1|
తలకు పిలక భారమా వలకు చిలక భారమా
కాలికి వేలు భారమా అయ్యయ్యయ్యో అయినా ఇంత ఘోరమా
చీ ముదనష్టపోడా..
|ఆమె|
అవునండి
.
|అతడు|
గుండెమంట వదిలింది గువ్వజంట మిగిలింది ||2||
ఒకరికొకరు బిడ్డలుగా భావిస్తూ బ్రతకండి
|ఆమె| అలాగే
|అతడు| శభాష్
.
|ఆమె|
కాశీకి పోయాడు మా ఆయన
పోయి బైరాగి అయినాడురా నాయనా ||2||
కాషాయమే కట్టి మా ఆయన
నన్ను గంగలో ముంచాడురా నాయనా ||2||
.
|అతడు|
వయసైపోయిన పెళ్ళాంతో ఇక లాభం లేదనుకున్నాడో
రంభా ఊర్వశి మేనకకోసం తపసు చేస్తూ ఉన్నాడో
అనిగాని కంగారు పడుతున్నావా అదేం జరగదులే ఏమంటే
గడ్డం నెరిసిన సరసుడితో ఏ రంభ ముచ్చటపడదమ్మా
నువ్వే దిక్కని రేపో మాపో తప్పక వస్తాడే బామ్మా
.
|ఆమె|
సుందరా ఎందరినో కాదని కన్నెగ మిగిలానురా
నిను చేరగా సుందరా సుందరా సుందరా
|అతడు|
బామ్మా నేను శంకరశాస్త్రిని గాను
నువ్వు మంజుభార్గవి కాదుగాని ఇక ఆపవే తల్లీ ఈ ఏడుపు వర్షం
||ఆదివారం||
.
.
(Contributed by Prabha) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)