|
Context
Song Context:
century ల కొద్ది పెద్ద serial గా సాగుతున్న మహ నవలరా ప్యారు
ఆ story కొట్టదు బోరు! |
Song Lyrics
||ప|| |అతడు|
తమ్ముడూ! అరె తమ్ముడూ! ఈ తిక మక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే నను అడగర చెపుతా డౌటుంటే
నువ్వు బెదరవు కద నా మాటింటే
అమ్మడూ అమ్మడూ నువ్వు మరి పరగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెపుతా వింటే
|ఖోరస్|
మస్టారూ మస్టారూ మంచి lecture ఇచ్చారు
మస్టారూ మస్టారూ love లొ మీరు మెగస్టారు
|అతడు| Thank you
.
||చ|| |అతడు|
వేల వేల భాషలున్న నేల మీద ఎక్కడైన ప్రేమ grammer ఒక్కటే loveru
ఆ langauage తెలియనిదెవరు
మూగ సైగ లైన చాలు వేడి ఊపిరైన చాలు గుర్తు పట్టలేరా ప్రేమికులు
అవి అచ్చు తప్పుల్లేని ప్రేమలేఖలు
america లొ english ప్రేమ africa లొ jungle ప్రేమ
ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒక్కటే ప్రేమ
పొట్టి వాడు పొట్ట వాడు నల్ల వాడు తెల్లవాడు
ప్రేమ దేశం వెళ్ళ గానె మానవులుగ మిగులుతారు
.
||చ|| |అతడు|
లక్షలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు
అది మహా సముద్రం ఫ్రెండు
century ల కొద్ది పెద్ద serial గా సాగుతున్న మహ నవలరా ప్యారు
ఆ story కొట్టదు బోరు
“క” గుణింతం తెలియని వాళ్ళు కాళిదాసులు అయిపొతారు
coffee tea లె తాగని వాళ్ళు దేవదాసులు ఐపొతారు
అమ్మడు ఓయ్ అమ్మడు lub dub heart beat love love
అన్నదంటే high class lo class చూసుకోదు ప్రేమ కేసు
.
.
(Contributed by Priyanka) |
Highlights
[Also refer to Pages 142-143 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)