|
Context
Song Context:
మమ్మేలు మారాజు & యువరాజు జంట మా వెంట ఉందంటే చాలు!
ముప్పూట మా ఇంట ముత్యాల జల్లు!
మన అందరి అండగ అన్నొకడుండగ రంగుల పండగ అయిపోదా ప్రతి పూటా!
|
Song Lyrics
||ప|| |అతడు1|
శ్రీ సూర్యవంశాన రామయ్య అంశాన పుట్టాడు మమ్మేలు మారాజు
|ఖోరస్|
అన్నయ్య నీడల్లే వెన్నంటి వస్తున్న చిన్నయ్య ఆ ఇంటి యువరాజు
|అతడు1|
కనులెదుటే కదులుతు ఉంటే
|ఖోరస్|
మురిసిన మా కళ్లు వెలుగుల వాకిళ్లు
|అతడు1|
మీ జంట మా వెంట ఉందంటే చాలు
|ఖోరస్|
ముప్పూట మా ఇంట ముత్యాల జల్లు
|అందరు|
ముక్కోటి దేవుళ్లు మిమ్మల్ని కాయాల చల్లంగ వెయ్యేళ్లు
.
|అతడు|
చక చక నాట్యాల కేళి
చక చక నాట్యాల కేళి రంగేళి హోఓఓఓలి..
|ఆమె|
నందామయా అనుకుందామయా అందుకుందామయా హైలెస్సో
|అతడు|
చందమామయ్య కిందికొస్తే సరదాగా నవ్వుకుందామయ్యా హైలెస్సో
.
||చ|| |అతడు|
నందనవనమున పొదరిళ్లు
హృదయాలు చిందెను పులకల పుప్పొళ్లు
|ఆమె|
పున్నమి కలలకు పుట్టిళ్లు
మనందరి కళ్లు పుత్తడి కలలకు పొత్తిళ్లు
|అతడు|
దొరలు ఎవరు అనుచరులు ఎవరు అను పోలిక చెరిపిన హోలీలు
కలల సిరులు కిలకిలల విరులు జనులందరినీ అను సందడిలో
మన అందరి అండగ అన్నొకడుండగ రంగుల పండగ అయిపోదా ప్రతి పూటా
||చక చక||
.
||చ|| |అతడు|
నింగిని విరిసిన హరివిల్లు
కరిగేనా ముంగిట కురిసేను సిరిజల్లు
|ఆమె|
చెంగున ఎగసిన పరవళ్లు
ప్రతొక్కరిలోనా పొంగిన వరదల ఒరవళ్లు
|అతడు|
మనసుపడిన కల మిణుకుమిణుకుమని నక్షత్రాల్లో కూర్చున్నా
వెనక వెనక పడి చినుకు చినుకులుగ తెచ్చిందీ వాన
మన చల్లని నవ్వులు రివ్వున రువ్విన రవ్వల రంగుల్లు చూపిన దారుల్లోన
||చక చక||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
దొరలు ఎవరు అనుచరులు ఎవరు అను పోలిక చెరిపిన హోలీలు!
&
మనసుపడిన కల మిణుకుమిణుకుమని నక్షత్రాల్లో కూర్చున్నా,
వెనక వెనక పడి చినుకు చినుకులుగ తెచ్చిందీ వాన!
….. మన చల్లని నవ్వులు రివ్వున రువ్విన రవ్వల రంగుల్లు చూపిన దారుల్లోన ….
wonerfully crafted!
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)