|
Context
Song Context:
మౌనమే గానమయ్యే ముహూర్తమే చూడవా! |
Song Lyrics
||ప|| |అతడు|
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
|ఆమె|
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
|అతడు|
మోహినీ మగకామినీ ముడివేయనీయవా
|ఆమె|
కాదని అనలేననీ గడియైన ఆగవా
|అతడు|
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
|ఖోరస్|
హద్దు పద్దు లేని ఆరాటం ఆగాలి
||ఒంపుల వైఖరి||
.
||చ||
మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా కంటే బద్నామి శుభకే
త్వంజీవ శరదస్యకం త్వంజీవ శరదస్యకం త్వంజీవ శరదస్యకం
|అతడు|
కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
|ఆమె|
శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం వరయాగ వాటిక
|అతడు|
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
|ఆమె|
మౌనమే గానమయ్యే ముహూర్తమే చూడవా
||ఒంపుల వైఖరి ||
.
||చ|| |అతడు|
నిష్ఠగా నిన్ను కోరీ నియమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
|ఆమె|
నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
నేర్పుగా ఈదిచేరే నిశ్చయం మెచ్చనా
|అతడు|
సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
|ఆమె|
మధనమే అంతమయ్యే అమృతం అందుకో
|| ఒంపుల వైఖరి ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)