|
Context
Song Context:
ఒక్కటే ఆశ.. అందుకో శ్వాస అచ్చగా అంకితం చేశా… పుచ్చుకో ప్రాణేశా! |
Song Lyrics
||ప|| |ఆమె|
ఒక్కటే ఆశ.. అందుకో శ్వాస అచ్చగా అంకితం చేశా… పుచ్చుకో ప్రాణేశా
అచ్చగా అంకితం చేశా… పుచ్చుకో ప్రాణేశా
|అతడు|
చుక్కనే చూశా.. లెక్కలే వేశా నింగిపై అంగలే వేశా.. కిందికే దించేశా
నింగిపై అంగలే వేశా.. కిందికే దించేశా
|ఆమె| ఒక్కటే ఆశ |అతడు| అందుకో శ్వాస
.
||చ|| |ఆమె|
మెత్తగా ఒళ్లో పెట్టుకో కాళ్లు ఉందిగా అంకపీఠం.. ఆడపుట్టుకే అందుకోసం
|అతడు|
గట్టిగా పట్టుకో… భక్తిగా అద్దుకో పుచ్చుకో పాదతీర్థం.. పాదపూజలె ఆదిపాఠం
|ఆమె|
చాకిరీ చెయ్యనా బానిసై.. నీ సేవలే చెయ్యనా పాదుషా
|అతడు|
దీవెనే తీసుకో బాలికా.. నీ జీవితం సార్థకం పొమ్మికా
|ఆమె|
మొక్కులే తీరి.. అక్కునే చేరి.. దక్కెనే సౌభాగ్యం
||చుక్కనే చూశా||
||ఒక్కటే ఆశ||
.
||చ|| |అతడు|
నచ్చెనే నారి.. వచ్చెనే కోరి తెచ్చెనే ప్రేమ సౌఖ్యం సాటిలేనిదీ ఇంతి సత్యం
|ఆమె|
మెచ్చెనే చేరి.. ముచ్చటే తీరి ఇచ్చెనే ప్రేమ రాజ్యం.. అంతులేనిదీ సంతోషం
|అతడు|
స్వప్నమే సత్యమై వచ్చెనేమో.. వెచ్చగా సర్వమూ పంచగా
|ఆమె|
స్వర్గమే సొంతమై దక్కెనేమో అచ్చటా ముచ్చటా తీర్చగా
|అతడు|
మక్కువే మీరి… ముద్దులే కోరి.. అందెనా ఇంద్రభోగం
||ఒక్కటే ఆశా||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)