|
Context
Song Context:
కుటుంబ సభ్యులు పెళ్ళీ కాబోయే పిల్ల పిల్లాడిని ఆట పట్టించడం!
|
Song Lyrics
||ప|| |ఆమె2|
ఈ పిల్లాదాని కొంగట్టుకొని తిరిగే మగాడు ఎవరే… |ఆమె3| ఎవరే?
|ఆమె2|
అడిగో… మరి ఈ సోగ్గాడికే పగ్గం వెయ్యగల మహారాణి ఎవరే?
|ఆమె3| ఎవరే? |ఆమె2| ఇదిగో…
|అతడు2|
పంచదార చిలక ఒకరంట…
|ఆమె2|
పచ్చిమిర్చి తునక ఒకరంట
ఈ తాంబూలాలతో ఆకు వక్క లాగ జంటవుతారంట
|అతడు1|
కుందనపు బొమ్మకి కళ్యాణము
|ఆమె1|
నందగోప బాలుని వైభోగము
|అతడు|
కొంచెం సిగ్గుపడవే సత్యభామా
|ఆమె|
నువ్వే నేర్పు అది చందమామ
|అతడు|
నీ సరాగలు మా ముందా, చాలు శృతి మించద్దోయమ్మా
|అతడు1| ||కుందనపు||
.
||చ|| |ఆమె|
తుంటరి సైగలు చేయకలా.. అసలేంటట నీ గోల
|ఆమె1|
ఆ కబురేదో వినిరావే పిల్లా
|అతడు|
ఇందరి మధ్యన ఎందుకులే.. అటు పక్కకి పోదాంరా
|అతడు1|
అందరిలో ఈ అల్లరి చెల్లదురా
|ఆమె| అయ్యిందా పెళ్లి.. బావా |అతడు| అపుడే ఏమైందే భామా
|ఆమె| అరెరె.. అలకా…
|అతడు1| మరీ వెంటపడకు బ్రహ్మచారి..
|ఆమె1| తగ్గించాలి చెప్పు చిన్నారి..
|అతడు1|
భర్తంటే బొత్తిగా కొత్తే లేదుగా.. ఎల్లాగే మరి??
|| కుందనపు ||
.
||చ|| |అతడు|
వయసుకి అన్నగా.. మనసుకి నాన్నగా నన్ను పెంచలేదా
|ఆమె1|
నీ కొడుకొచ్చి “తాతా” అనడు కదా
|ఆమె|
వరసకి నువ్వు అక్కవి అయినా అత్తగారి హోదా
|అతడు1|
వయ్యారంలో నిన్నే మించిపోదా
|అతడు2|
ఎవ్వరికెవరెవరో వరసా |ఆమె2| ఏమని పిలవాలో తెలుసా
|అతడు|
కిటుకే చెబుతా…
ఆడాళ్లంతా మనకి ఆంటీస్
|ఆమె|
మగాళ్లంతా మనకి అంకుల్స్
|అతడు1|
మరి ఆలుమగలకి రూలే పెడితే అపుడేలాగమ్మలు?
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)