|
Context
Song Context:
సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా… నమ్మే మాటలా?
|
Song Lyrics
||ప|| |అతడు|
పచ్చగా పండదు ఈ నేల…
బతుకులా ఉండదు ఏ వేళ
మృత్యువే మురిసేలా
నెత్తురే కురిసేలా
పగలెన్నో రగలాలా
ఉయిలాల..ఉయిలాల… || 4 ||
.
||చ|| |అతడు|
ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల.. తగ్గించేదెలా?
దూరం పెంచే పంతాలే సంతోషించేలా.. తలవంచేదెలా?
ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా
దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడినా
ముగిసేనా ఇకనైన ఎగసే జ్వాలా?
ఉయిలాల..ఉయిలాల.. || 4 ||
.
||చ|| |అతడు|
ముళ్లను తెచ్చి నాటాక మల్లెలు పూస్తాయా.. అసాధ్యం కదా?
సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా.. నమ్మే మాటలా?
వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల…
శ్మశానపు చిచ్చుల కాంతిలో స్వర్గమే చూడదా
పగ పెంచే ప్రతి శిరసూ ఒరిగే వేళ
ఉయిలాల..ఉయిలాల… || 10 ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)