ఏప్రియల్ 1 విడుదల: మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంటా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   April 1 Vidudala
Song Singers
   Balu,
   Chitra
Music Director
   Ilaya Raja
Year Released
   1991
Actors
   Rajendra Prasad,
   Shobhana
Director
   Vamsi
Producer
   P.V. Bhaskara Reddy

Context

Song Context:
A compulsory liar is challenged by his lover to speak only the blunt truth until April 1, to win her!
     మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంటా…

Song Lyrics

||ప|| |అతడు|
       మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంటా
       రుజువంటూ దొరికిందంటే గంటకొట్టి చాటేస్తూ ఉంటా
|ఆమె|
       నిజమంటే తంటాలంట..నిక్కుతుంటే తిక్కదిగుతాదంట
       మొదలంటూ పెడతావంట వెంటబడి తెగ తంతారంట
|అతడు|
       గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంట
       ఎవరంటే నాకేం అంటా తప్పులుంటే ఒప్పనంటా
|ఆమె|
       నీ వెంటే నేను ఉంటా…చూస్తుంటా ఓరకంట..
       నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంట
                                ||మాటంటే మాటేనంట||
.
||చ|| |అతడు1|
       నువ్వే మా మొదటి గెస్టని మా ఆవిడ వంట బెస్టని
       ఈ ఫీస్టుకి పిలుచుకొస్తినీ..టేస్టు చెప్పిపోరా
|ఆమె1|
       ఇదే మా విందుభోజనం మీరే మీ బంధువీ దినం
       రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి చెప్పుతారా
|అతడు|
       అపార్థం చేసుకోరుగా అనర్థం చెయ్యబోరుగా
       యదార్థం చేదుగుంటది పదార్థం చెత్తగున్నది
       ఇది విందా.. నా బొంద తిన్నోళ్లూ గోవిందా
       జంకేది లేదింక.. నీ టెంక పీకెయ్యగా.. పదరా కుంకా…
                                       || నిజమంటే ||
.
||చ|| |అతడు|
       భళారే నీలిచిత్రమా.. భలేగా ఉంది మిత్రమా
       ఇలా రసయాత్ర సాగదా పక్కనుంటే భామా
       కోరావే అసలు ట్రూతును.. చూపాను సిసలు బూతును
       చిక్కారు తప్పు చేసి.. ఇక మక్కెలిరగదన్ను
|ఆమె|
       తమాషా చూడబోతిరా… తడాఖా చూపమందురా
       మగాళ్లని అదిరిపడితిరా.. మదించి మొదలు చెడితిరా
       సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా లాకప్పు పైకప్పు నీకిప్పుడే చూపుతా
       బెండు తీస్తా
                                    ||మాటంటే మాటేనంట||
.
.
                       (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)