|
Context
Song Context:
వీచే గాలి సొంతిల్లంది అందరి గుండెల్లోనా
ఒంటరి వాళ్ళు ఎవరుంటారు ఇంత ప్రపంచంలోనా!
|
Song Lyrics
||ప|| |అతడు|
నవ్వాలంటే సందేహం మాని నవ్వేయ్ అంతే
నమ్మావంటే సంతోషాలన్నీ నీవయినట్టే
పరదాలులేని తనముంటే పహరాలు దాటమని అంటే
పసివాళ్ళలోని గుణముంటే పరువాలు లేవు అనుకుంటే
ఆమె :
పరదాలులేని తనముంటే పహరాలు దాటమని అంటే
పసివాళ్ళలోని గుణముంటే పరువాలు లేవు అనుకుంటే
అతడు :
తొడగవా తలపులకు రెక్కలు తొలగవా ఉలికిపడి దిక్కులు
ఆమె :
పలకవా ఎదురు పడి చుక్కలు తెలపవా ఎదకు తన హక్కులు
|అతడు| ||నవ్వాలంటే ||
.
చరణం: ఆమె:
తరగని బరువైతే దిగులు జరగవు సరిగా ఏ పనులు
త్వరపడి తరిమేసేయ్ అది మనకవసరమా
మనసున కొలువైతే గుబులు మననొదలదుగా రేపగలు
పొరబడి చోటిస్తే తదుపరి మనతరమా
అతడు :
నీకే నువ్వు ఇరుకై పోవా ఏకాంతానా వుంటే
సరదాలోని స్వరమై పోవా పదుగురి పకపక వింటే
ఆమె :
పలకవా ఎదురు పడి చుక్కలు తెలపవా ఎదకు తన హక్కులు
అతడు :
తొడగవా తలపులకు రెక్కలు తొలగవా ఉలికిపడి దిక్కులు
|అతడు| ||నవ్వాలంటే ||
.
చరణం: ఆమె:
నదులను నిలపదుగా అలుపు ఎధలయకుండదుగా మరుపు
కలలకు అంటదుగా నడిరాతిరి నలుపు
చినుకుల చెలిబడి నీ పిలుపు తడితడి చెలిమితో నీ కొరకు
గగనము దిగివస్తే వెయ్యకు ఏ గొడుగు
అతడు :
వీచే గాలి సొంతిల్లంది అందరి గుండెల్లోనా
ఒంటరి వాళ్ళు ఎవరుంటారు ఇంత ప్రపంచంలోనా
ఆమె :
పలకవా ఎదురు పడి చుక్కలు తెలపవా ఎదకు తన హక్కులు
అతడు :
తొడగవా తలపులకు రెక్కలు తొలగవా ఉలికిపడి దిక్కులు
|అతడు| ||నవ్వాలంటే ||
.
.
(Contributed by Vijaya Saradhi) |
Highlights
పరదాలులేని తనముంటే పహరాలు దాటమని అంటే
పసివాళ్ళలోని గుణముంటే పరువాలు లేవు అనుకుంటే
తొడగవా తలపులకు రెక్కలు తొలగవా ఉలికిపడి దిక్కులు
పలకవా ఎదురు పడి చుక్కలు తెలపవా ఎదకు తన హక్కులు (Wow!)
.
నీకే నువ్వు ఇరుకై పోవా ఏకాంతానా వుంటే
సరదాలోని స్వరమై పోవా పదుగురి పకపక వింటే
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)