|
Context
Song Context:
అవస్థ పెరిగితే అనర్ధమే చికిత్స జరుగుట అవశ్యమే!
(A చిలిపి సిరివెన్నెల hilarious presentation!)
|
Song Lyrics
||ప|| |అతడు|
పుటుక్కు జరజర డుబుక్కుమే! అడక్కు అది ఒక రహస్యమే!
ఆమె:
అవస్థ పెరిగితే అనర్ధమే! చికిత్స జరుగుట అవశ్యమే! ||2||
అతడు :
చిటుక్కు మంటే చీమా… గతుక్కుమంటావేమ్మా
ఆమె :
చురుక్కు మంటే ప్రేమా… ఛిర్రెక్కి పోదా భామా
|అతడు| ||పుటుక్కు జరజర||
|ఆమె| ||అవస్థ పెరిగితే||
.
చరణం: అతడు :
అరువిచ్చావనుకో నాకు అరవిచ్చిన్నీ కళ్ళు
అవి చూపిస్తాయి నీకు నేమెచ్చిన అందాలు
ఆమె :
ఉబికోచ్చాయనుకో నీకు ఉసిగోట్టే ఉవ్విళ్ళు
అవి రప్పిస్తాయి నాకు ఉడికేత్తే ఆవిర్లు
అతడు:
వెచ్చబడితిని… రెచ్చిపోవనా
వెచ్చబడితే నీచెక్కిళ్ళు రెచ్చిపోవా నాఎక్కిళ్ళు
ఆమె :
మరొక్కసారీ అనద్దు సారీ… చమక్కుమారి జతక్కు చేరి…
లొంగ దీసుకో నీ కౌగిట్లో… చిక్కులు తీరక పోవయ్యో…. మక్కువ దాచక రావయ్యో
|అతడు| ||పుటుక్కు జరజర||
|ఆమె| ||అవస్థ పెరిగితే||
.
చరణం: ఆమె:
బరువెక్కిస్తుంటే నన్ను పులకింతల పుప్పొళ్ళు
వరమాలై వచ్చేస్తాను పురుషుళ్ళా నన్నేలు
అతడు :
పరుగెత్తిస్తుంటే నిన్ను… పగబట్టిన పువిల్లు
శరణంటే రక్షిస్తాను.. పరవళ్ళయి నన్నల్లు
ఆమె :
ఒక్కదాన్ని.. నా నా నా… ఎక్కడెక్కడ… నా నా నా
ఒక్కదాన్ని ఇంకెన్నాళ్ళు… ఎక్కడసలు నువ్విన్నాళ్ళు
అతడు :
అటొక్కసారి.. ఇటొక్కసారి.. ప్రతొక్కదారి… వెతక్కే నారి…
తొంగి చూసుకో నీ గుండెల్లో అక్కడ ఉండుంటానమ్మో ఇక్కడ ఎక్కడ లేనమ్మో
|అతడు| ||పుటుక్కు జరజర||
|ఆమె| ||అవస్థ పెరిగితే||
.
.
(Contributed by Vijaya Saradhi) |
Highlights
పుటుక్కు జరజర డుబుక్కుమే! అడక్కు అది ఒక రహస్యమే! First checkout the song నువ్వొస్తానంటే నేనొద్దంటానా: పారిపోకే పిట్టా… చేరనంటే ఎట్టా to recollect the origination of this phrase or what ever that is 
.
అరువిచ్చావనుకో నాకు అరవిచ్చిన్నీ కళ్ళు (అరవిచ్చిన నీ కళ్ళు)
అవి చూపిస్తాయి నీకు నే మెచ్చిన అందాలు
My goodness! Don’t miss the logic here!
.
Now absolutely do not miss this construction!
వెచ్చబడితిని… రెచ్చిపోవనా
వెచ్చబడితే నీచెక్కిళ్ళు రెచ్చిపోవా నాఎక్కిళ్ళు
Absolutely fantastic! Only a certain Sirivennela can juggle letters here to there & there to here; And bring totally different meaning to the words and yet without losing the conceptual flow!
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)