|
Context
Song Context:
ప్రేమ యావ (ఈ పిలగాడికి)!
|
Song Lyrics
||ప|| |ఆమె|
పరాగ్గా ప్రేమలో పడినావా… అడంగు చేరని నావవై నావా
ఓ కుర్ర వయసా… ఓసి వెర్రి మనసా
అసలేమిటంటావు.. ఎందుకంటావు
ముందెనక చూసుకొనీ యావ
.
చరణం: ఆమె:
ఆగలేక ఆత్ర పడినావా.. నువ్వు సాగలేని యాత్రకెళ్ళినావా..
ఇక యాగ లేక యాతనడిపోవా
|ఖోరస్|
యావ యావ యావ యావ యావ
.
చరణం: ఆమె:
సింతాకంత పాటి సింతన్నమాటలేక సంతోషంగా లేవ ఇంతదాకా
ఏ మంట తాక పట్టి ఈ వింత కాక పుట్టి అగ్గగ్గ లాడినావు ఇంతలాగా
మీసకట్టు మొలిసిన పిలగాడా
|ఖోరస్|
యావ యావ యావ యావ యావ
|ఆమె|
ఆశకట్టు నిలపని తొలి ఈడా
|ఖోరస్|
యావ యావ యావ యావ యావ
|ఆమె|
మీసకట్టు మొలిసిన పిలగాడా… ఆశకట్టు నిలపని తొలి ఈడా
ప్రేమగుట్టు తెలుసనుకున్నావా
తేనెపట్టు ఏరేసి పూలసెట్టు కూరేసి ఊపిరాడకుండా చేసి
ఉక్కిరిబిక్కిరి అయిపోయావా
|ఖోరస్|
యావ యావ యావ యావ యావ.. యావ యావ యావ యావ యావ
.
చరణం: ఆమె:
ఇంతే సంగతని ఇంకేం లేదు అని సెప్పే వీలు లేని ప్రేమకైపు
ఆగేదేప్పుడని ఆలోసించకని ఎంట తిప్పుకుంటదంటా ఎంత సేపు
ముక్కు మూసి మూలనున్న మునులైనా
|ఖోరస్|
యావ యావ యావ యావ యావ
|ఆమె|
అష్ట దిక్కులేలుతున్న ఘనులైనా
|ఖోరస్|
యావ యావ యావ యావ యావ
|ఆమె|
ముక్కు మూసి మూలనున్న మునులైనా.. అష్ట దిక్కులేలుతున్న ఘనులైనా
దిక్కుమాలి పోయినోళ్ళేఎవరైనా
చేజారి నాక మనసే ఏ మాయ దారి వెంట ఏమారి పోయినట్టు
బేజారెత్తి బెంగటిల్లి పోవా
|ఖోరస్|
యావ యావ యావ యావ యావ.. యావ యావ యావ యావ యావ
యావ యావ యావ యావ యావ.. యావ యావ యావ యావ యావ
.
.
(Contributed by Vijaya Saradhi) |
Highlights
సింతాకంత పాటి సింతన్నమాటలేక సంతోషంగా లేవ ఇంతదాకా
ఏ మంట తాక పట్టి ఈ వింత కాక పుట్టి అగ్గగ్గ లాడినావు ఇంతలాగా
.
తేనెపట్టు ఏరేసి పూలసెట్టు కూరేసి ఉపిరాడకుండా చేసి
ఉక్కిరిబిక్కిరి అయిపోయావా Wow!
.
A very interesting telugu slang!
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)