|
Context
Song Context:
ఇచ్చేదే గాని దోచేది కాదురా స్వచ్చమైన సావాసం!
ప్రేమిస్తునాననే తలపు నీకు ఇవ్వాలి నిత్య సంతోషం! |
Song Lyrics
||ప||అతడు|
ఎదురయే every లైలా మృదువుగా నవ్వితే చాలా
మెదడలా నివ్వెర పోవాలా
ఎదలయే కెవ్వుమనేలా మొదలయే యవ్వనలీలా
నిదురలో నిప్పులు పొయ్యాలా
బహుబాగుందిరా బాలా కాసేపటు చూసాం కదరా
ఇహ చాలనుకోవాలా మతి చెడితే మజునూలవరా
ఊరికె మనసునంతగా ఉరకనీకురా అటుఇటుగా
ఉహాలో మునిగిపోతే మరి పైకి తేలవురా అయ్యయ్యయ్యయ్యయ్యో
||ఎదురయే||
.
చరణం: |అతడు|
అంతులేని ఆశ అంతలో నిరాశ నిముషమొక్క చోట నిలవనీదురా
ఎందుకో హమేషా వయసుకీ ప్రయాసా మాయలేడి వేట మానుకోదురా
ప్రతి పిల్లగాలి తన్నెల్లకాలము వదిలిపోక నిలిచేనా
ఏ గుండెగూడు ఏ గువ్వ సొంతమో ముందుగానే తెలిసేనా
||ఊరికె మనసునంతగా || ||ఎదురయే||
.
చరణం: |అతడు|
కొలిమిలాగా మండే కలత రేపుతుంటే దాన్ని చెలిమి అంటే తప్పు సోదరా
వంద ఏళ్ళు వుండే జన్మ బంధమంటే పంతమాడి పొందే గెలుపు కాదురా
ప్రేమిస్తునాననే తలపు నీకు ఇవ్వాలి నిత్య సంతోషం
ఇచ్చేదే గాని దోచేది కాదురా స్వచ్చమైన సావాసం
||ఊరికె మనసునంతగా || ||ఎదురయే||
.
.
(Contributed by Vijaya Saradhi) |
Highlights
Unbelievable conceptualization! Only in a certain Sirivennela’s patented presentation style!
.
what is true love?
fallacies, definitions, emotions, messages, philosophy… all happening there!
.
This kind of songs if you listen casually… some lines in pallavi…, there is a potential danger to think it is yet another love song.
That is why this site exists - to follow the lyrics while you listen!
Fascinating writing that is!
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)