|
Context
Song Context:
ఐతే విను ఈ సత్యం నువ్వంటే నాకిష్టం! |
Song Lyrics
||ప||అతడు|
అనాలనుంది నీతో కొన్నాళ్ళుగా ఓ మాట
ఆమె:
వినాలనుంది ఏదో నువ్వు చెప్పే ఆ వింత
అతడు:
చప్పున అలా చెప్పమంటే ఎలా గుండెల్లో దడ రాదా
ఆమె:
ఇప్పుడు ఇలా తప్పుకుంటే ఎలా అదంత చెడు వార్తా
అతడు:
చెపితే నవ్వుకుంటావో కోపం చూపుతావో
ఆమె:
ఇక చాల్లే చాదస్తం జరగదులే ఏ నష్టం
అతడు:
ఐతే విను ఈ సత్యం నువ్వంటే నాకిష్టం
|| అనాలనుంది నీతో ||
.
చరణం 1: ఆమె:
అమ్మచాటు అమ్మాయిలా ఈ సిగ్గెందుకు పాపం
అతడు:
ఆకతాయి అబ్బాయిలా చూస్తావని సందేహం
ఆమె:
నువ్వో స్వాతిముత్యం ముందే తెలుసులే
అతడు:
మరీ అంత హాస్యం ధర్మం కాదులే
ఆమె:
ఐతే నీకు ఈ ధైర్యం లేదే ఇంతకాలం
అతడు:
సహజంగా నాకు భయం ఇపుడింకా కాస్త నయం
ఆమె:
నాకుండాల్సిన బిడియం నీకుంటే ఏం న్యాయం
|| అనాలనుంది నీతో ||
.
చరణం 2: అతడు:
నేర్పలేదు నాకెవ్వరూ ప్రేమించే పద్ధతులు
ఆమె:
కొమ్మమీద ఆ గువ్వలు పెడుతున్నవి తరగతులు
అతడు:
అసలేనాడు చూడని చిత్రం నాకిది
ఆమె:
నువ్వింకా పసిపాపవి అంతేగా మరి
అతడు:
అరెరే నమ్మవేంటసలు నిజమే అమ్మతోడు
ఆమె:
అయితే నాకలవాటా నాక్కూడా కొత్తేగా
అతడు:
అంటే మరి ప్రతిజంటా మనలాగే ఉంటారా
|| అనాలనుంది నీతో ||
.
.
(Contributed by Phanindra KSM) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)