శుభలగ్నం: చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Subha Lagnam
Singers
   S.P. Balu
Music Director
   S.V. Krishna Reddy
Year Released
   1994
Actors
   Jagapathi Babu, Amani, Roja
Director
   S.V. Krishna Reddy
Producer
   K.L. Venkateswara Rao

Context

Song Context:
      So what did you give up in return for your greed?

Song Lyrics

||ప|| |అతడు|
      చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
      తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
      మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక
      లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక 
                                             || చిలకా ఏ తోడు ||
.
|ఖొరస్| గోరింకా యేదే చిలకా లేదింకా || 2 ||
||చ|| |అతడు|
      బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే || బతుకంతా బలి చేసే ||
      వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
      అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
      కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
                                             || చిలకా ఏ తోడు ||
.
|ఖొరస్| కొండంతా అండే నీకు లేదింకా || 2 ||
||చ|| |అతడు|
      అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో||అనురాగం కొనగలిగే||
      మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
      ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలో
      తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా 
                                             || చిలకా ఏ తోడు ||
.
.
                                   (Contributed by Nagarjuna)

Highlights

                       1994 Nandi Award Winner!
                       1994 కళాసాగర్ Award Winner!
                       1994 మనస్విని Award Winner!
.
A Sirivennela Classic!
.
The lyrics are so appropriately precise to the context, yet if you lift the line “మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక”, they are amazingly (rather by design!) universalized for anything valuable one gives up in return for the greed!
.
ఏ వాక్యం లోను భావుకత (అవసరం)లేదు; Each and every line is logical & concrete, and borne out of deeper wisdom!
.
[Also refer to Page 256 in సిరివెన్నెల తరంగాలు & Pages 12-13 in “నంది” వర్ధనాలు]
………………………………………………………………………………………………

One Response to “శుభలగ్నం: చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక”

  1. Mahidhar Challa Says:

    “అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే”
    ఎంతో విలువైన జీవితన్ని కొల్పోయి విషపురితమైన ఫలితన్ని పొదావు అని చెప్పడానికి సిరివెన్నెల వాడిన సాహిత్యం గురించి ఎమి చెప్పగలం. కనక వర్షం కురుస్తున్న నిరు పేదరలిందంత అమె. మాటలు లేవు చెప్పడానికి

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)