Movie Name
Cheppalani Vundi Singers S.P. Balu, Harini Music Director
Mani Sharma Year Released 2001 Actors
Vadde Naveen, Raasi Director Srinivas Producer G. Govardhana Rao
Context
Song Context: ఓ యుగళ గీతం
Song Lyrics
||ప|| |ఆమె|
కో కో కో కోయిలల రాగంలో
కో కో కో కొత్త శృతి చేరిందో
|అతడు|
కో కో కో కోరికల తాళంలో
కో కో కో కొంటెలయ ఏమందో
|ఆమె|
కొనగోరే మీటిందేమో ఈడల్లరి
నను చేరే దాటిందేమో నీ ఊపిరి
|అతడు|
తొలిసారే తాకిందేమో ఆడావిరి
పొలిమేరే దాటిందేమో జతలాహిరి
|ఆమె|
కునుకొదిలిన కులుకుల పిలుపులు తెలుసుకొ
|| కో కో కో || |ఆమె| |అతడు|
.
||చ|| |ఆమె|
అనుకోనే లేదు నిజంగా - నను తాకిన నీ కనుసైగ
అణువణువున రగిలిందింకా ఎంతో మధురంగా
|అతడు|
ఐనా ఇది అణువంతేగా - అసలెంతో మిగిలిందింకా
మదనుడి కధ మొదలయ్యింది ఏది ఇపుడేగా
|ఆమె|
కాస్త విసుగ్గ కాస్త ఖుషీగా ఉంది వింతగా
|అతడు|
ఇది ఎంత సుఖంగా ఎంత చురుగ్గా రేపుతుందో తీపి తికమక
|| కో కో కో || |ఆమె| |అతడు|
.
||చ|| |అతడు|
చెలిపైటే చెలగాటంగా తెరతీస్తే కాస్త పరాగ్గా
చెడిపోదా చూపు చిరాగ్గా కైపే ముదరంగా
|ఆమె|
అలవాటే లేని విధంగా అదిలేస్తే ఉన్నపళంగా
మతిపోదా మోహనరంగా అందం మధురంగా
|అతడు|
పెంకితనంగా పెంచకు ఇంకా వేడి వేడుక
|ఆమె|
మోహమాటపడంగా బైట పడంగా ఆడే ఈడు వెంట తరమగ
|| కో కో కో || |అతడు| |ఆమె|
.
.
(Contributed by Pradeep)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world