Posted by admin on 10th September 2010 in
నీలిమేఘాలు
|
Context
Song Context:
నీలిమేఘాలు!
|
Song Lyrics
ఆమె:
నీలిమేఘాలు
అతడు:
నీలిమేఘాలు ఆకాశవీధిలో ఆడుకునే మెరుపుకన్నె
నీలిమనే అమ్మాయే ఈ నేలకు వచ్చేసిందని
ఆమెను అణ్వేషిస్తూ వచ్చిన దివిదూతలు
.
ఆమె:
నీలిమేఘాలు
అతడు:
నీలిమేఘాలు ఉరుముతున్న గొంతులెత్తి దిగంతాల్ని పిలుస్తూ
ఆమె కొరకు బహుమతిగా హరివిల్లుని చూపిస్తూ
నీలిమా నీలిమా అని కలవరించే నీలాంబరి రాగాలు
.
ఆమె:
నీలిమేఘాలు
అతడు:
నీలిమేఘాలు చల్లని స్నేహపు జల్లులు చిరుగాలుల చేతులతో
ఆమె మేని వయ్యారాల సీమనంతా స్పర్శిస్తూ
చిరకాలపు నేస్తానికి చేరువైన సరాగాలు
.
పల్లవి: ఆమె:
ఆకాశంలో నీలిమబ్బులై ఊరేగే ఊహలు
అమ్మనువదిలి ఆకతాయిలై పరిగెత్తే పాపలు
అవి చిరుజల్లుల్లో చిట్టిచినుకులై తిరిగొచ్చే వేళ
తను చిగురిస్తుంది పులకరింతలై నాగుండెల నేల
అతడు:
కుదురుగ ఉంటే మంచుబొమ్మలా ఊగిపోద హృదయం
కులికందంటే వనమయూరిలా ఆగిపోద కాలం
.
చరణం: ఆమె:
కల్లోకొచ్చి కోటితారలు కవ్విస్తాయెందుకో
తళతళలన్నీ కోసుకొమ్మని ఊరిస్తాయెందుకో
నే చిటికెలుకొడితే తారలు మొత్తం తలవంచుకు రావా
నా పెరటితోటలో మంచుబొట్లుగా కల నిజమే కాదా
అతడు:
గాలికి ఊగే జాజితీగలా నాజూకు జాణ
గగనాన్నైనా నేలకుదించే ఈ శ్రావణ వీణ
.
చరణం: ఆమె:
ఎల్లలులేని గాలిపటంలా ఎగిరేటి కోర్కెలు
జాబిలితోనే ఊసులాడుతూ రాసుకున్న లేఖలు
అవి దారంతెగితే తీరం లేని ఆవారా ఆశలు
ఆధారం ఉంటే అష్టదిక్కులు పాలించే రాణులు
అతడు:
లావణ్యాన్నే చూపగలిగిన అంతటి రవివర్మ
ఆంతర్యంలో అంతుదొరకని సొగసు చూపతరమా
.
.
(Contributed by Prabha) |
జల్లులు
Highlights
Observe the relations to మెరుపులు, ఉరుములు, జల్లులు
& ఊహలు, కోటితారలు, కోర్కెలు ! Amazing poetry!
.
లావణ్యాన్నే చూపగలిగిన అంతటి రవివర్మ ఆంతర్యంలో అంతుదొరకని సొగసు చూపతరమా!
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)