|
Context
Song Context:
నీ సొగసు చూడతరమా!
|
Song Lyrics
||ప|| |అతడు|
సొగసు చూడతరమా సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా
మరుని నారి నారిగ మారి మదినినాటు విరిశరమా
||సొగసు||
.
చరణం:
కులుకే సుప్రభాతాలై - కునుకే స్వప్న గీతాలై
ఉషా కిరణము - నిషా తరుణము
కలిసే కలికి మేనిగా - రతికాంతుని కొలువుగా
వెలసే చెలి చిన్నెలలో … సొగసు చూడతరమా
.
చరణం:
పలుకా చైత్రరాగాలే - అలకా గ్రీష్మ తాపాలే
మదే కరిగితే - అదే మధుఝరి
చురుకు వరద గౌతమి - చెలిమి శరత్పౌర్ణమి
అతివే అన్ని ఋతువులయ్యే
||సొగసు చూడతరమా||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)