|
Context
Song Context:
పుట్టిన (పల్లె)వూరికి (చాలారోజుల తరువాత) వెళితే! |
Song Lyrics
||ప|| |అతడు|
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు || 2 ||
ననుగన్న నా వాళ్లు నా కళ్ల లోగిళ్ళు || 2 ||
|| ఈ గాలి ||
.
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తెలిశాక వచ్చేను నా వంక || చిన్నారి ||
ఎన్నాళ్లో గడిచాకా ఇన్నాళ్లకు కలిశాక || 2 ||
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాక || 2||
ఎగసేను నింగి దాకా….
|| ఈ గాలి ||
.
||చ|| |అతడు|
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలు
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు || ఏనాడు ||
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథలు || 2 ||
ఈ రాళ్లే జవరాళ్లై ఇక నాట్యాలాడేను || 2 ||
.
||చ|| |ఆమె|
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై || కన్నె ||
గగన గళము నుండి అమర గాన వాహినీ || 2 ||
జాలువారుతోంది ఇలా అమృతవర్షిణి అమృతవర్షిణి అమృతవర్షిణి…
ఈ స్వాతి వానలో నా ఆత్మ స్నానమాడే
ఈ మురళి లో నా హృదయమే స్వరములుగా మారే
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్లు నా కళ్ల లోగిళ్ళు
ఈ గాలి ఈ నేల
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A Sirivennela Classic!
.
[Also refer to Pages 23 & 30 - 33 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)