|
Context
Song Context:
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే,
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే!
చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగుపూలు తేవే!
(వెన్నెల్లో బృందావనం చూపిస్తూ ఓ గుడ్డి పాపకి (జోల)పాట!) |
Song Lyrics
||ప|| |ఆమె|
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే || చందమామ ||
|ఖోరస్|
చందమామ రావే జాబిల్లి రావే
.
||చ|| |ఆమె|
చలువ చందనముల పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే || చలువ ||
|అతడు|
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే || 2 ||
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే ||చందమామ||
.
||చ|| |ఆమె|
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం || మునిజన ||
|అతడు|
రాధామాధవ గాథల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం || 2 ||
|అందరు|
బృందావనం బృందావనం
|ఆమె|
హే కృష్ణా ముకుందా మురారి…. || 2 ||
జయ కృష్ణా ముకుందా మురారి
జయ జయ కృష్ణా ముకుందా మురారి
||చందమామ ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
[Also refer to Pages 27 & 30 - 33 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 20th, 2010 at 11:46 pm
ఆత్మానందం అంటే ఎంటో తెలియాలంటే ఈ పాటని అనుభవిస్తే తెలుస్తుంది.
మునిజన మానస మోహిని యోగిని బృందావనం (రామావతారం లొ మునులు రాముణ్ణీ ప్రేమిస్తే రాముడు, ఏక పత్ని వ్రతుడు కావడం వల్ల, తిరిగి ప్రేమించలేడు. ఐతే, క్రిష్ణావతారంలో మునులు గొపికలుగా వస్తే క్రిష్ణుడు అందరినీ ప్రేమిస్తాడు.
ఒక్క వాక్యంలొ ఇంతటి కధని చెప్పడమనేది గురువు గారికె చెల్లింది…)
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధామాధవ గాథల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం (ప్రేమ అంటే ఎంత పవిత్రమైనదో ఒక్క రాధా కృష్ణుల నుంచి మాత్రమే తెలుస్తుంది. అలాంటి ప్రేమ గాధ చవి చూసిన బృందావనం ఎంతటి పవిత్ర మైన భూమి?)
ఈ పాట విన్నప్పుడల్లా నాకు మాత్రం బృందావనంలొ తిరిగినట్టుంటుంది.
ఇంత గొప్ప పాట రాసిన గురువు గారికి మరొక్క సారి పాదాభివందనం…