|
Context
Song Context:
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం!
(A blind man describing his lover!) |
Song Lyrics
||ప|| |అతడు|
మెరిసే తారలదేరూపం విరిసే పువ్వులదేరూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
|| మనసున ||
.
||చ|| |అతడు|
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెతుకులాడేనా
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత రూపం
నీ రూపం అపురూపం
.
||చ|| |అతడు|
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా || ప్రాణం ||
వెదురును మురళిగ మలచి
నాలో జీవననాదం పలికిన నీవే నా ప్రాణస్పందన
నీకే నా హృదయ నివేదన
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A Sirivennela’s superb conceptualization!
.
[Also refer to Pages 29 & 30 - 33 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)