Posted by admin on 17th September 2010 in
టూర్ గైడ్
|
Context
Song Context:
ఈ ఆర్టు చూసి హార్టుబీటు రూటు మార్చి కొట్టుకుంటు ఆహా ఓహో అంటున్నది!
హిస్టరిలో మిస్టులోని మిస్టరీని చాటి చెప్పి ఆహా ఓహో అంటున్నది! |
Song Lyrics
||ప|| |అతడు|
పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిది
నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బండల్లో పలుకుతున్నది || పాటల్లో ||
ఈ ఆర్టు చూసి హార్టుబీటు రూటు మార్చి కొట్టుకుంటు
ఆహా ఓహో అంటున్నది అది ఆహా ఓహో అంటున్నది
.
ఈ ఇలలోన శిలపైనా కొలువైన వాణి ||2||
వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి ||2||
.
|ఆమె|
నల్లనయ్యా పిల్లనగ్రోవినూదా - వెల్లువై ఎద పొంగిపోదా ||2||
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా ||2||
నల్లనయ్యా…
.
||చ|| |అతడు|
అందమైన సుందరాంగులు
ఎందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి ఉన్నదీ
నాటి ప్రేమ జాడలెన్నో కన్నదీ || అందమైన ||
హిస్టరిలో మిస్టులోని మిస్టరీని చాటి చెప్పి ఆహా ఓహో అంటున్నది
అది ఆహా ఆహా ఓహో ఓహో అంటున్నది
.
||చ|| |ఆమె|
రాసలీలా రాగహేలా రసమయమై సాగు వేళ ||2||
|అతడు|
తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా
|ఆమె|
నురుగుల పరుగుల సాగే యమునా నది ఆగు వేళ
|అతడు|
నింగీ నేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే ||2||
||నల్లనయ్యా||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
రాసలీలా రాగహేలా రసమయమై సాగు వేళ
తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా
నురుగుల పరుగుల సాగే యమునా నది ఆగు వేళ
నింగీ నేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే!
.
[Also refer to Pages 25 & 30 - 33 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)