|
Context
Song Context:
చిక్కులంటు ఉండవే సిరిమల్లీ, దుఃఖమంటు లేని వాళ్ళకి! |
Song Lyrics
||ప|| |ఆమె|
జోలాలీ జోలాలీ జో - జోలాలీ జోలాలీ జో
చిగురంత నవ్వవే చిట్టి తల్లీ
లేని పోని బింక దేనికి
చిక్కులంటు ఉండవే సిరిమల్లీ
దుఃఖమంటు లేని వాళ్ళకి
చిన్నబోక చిన్నారి ఎంత కష్టమొచ్చినా
వెన్నెలంటి నవ్వుంటె చీకటుండునా
||చిగురంత ||
.
చరణం 1: |ఆమె|
పెళ్ళైన ఆడజన్మ పడకింటి ఆట బొమ్మా
తాళలేవా వేళచూసైనా
శృంగార సార్వభౌమా కంగారు కూడదమ్మా
రేయిపగలు రాసలీలలేనా
ఆలితోబాటుగా అమ్మనయ్యానుగా
కౌగిలే కాపురం అయితే ఎలా
చల్లారని సరసానికి సంసారమా
||చిగురంత ||
.
చరణం 2: |ఆమె|
మోహమే కళ్ళు మూసి మమతనే కాలరాసి
కామదాహం గొంతు కోసిందీ
మనసునే మాయ చేసి మనిషినే మృగాన్ని చేసి
పాడుమైకం గంతులేసిందీ
తాపమే శాపమై కట్టుబడి దాటితే
దీపమే జ్వాలగా కాల్చిపోదా
కళ్ళెం విడే కల్లోలమే కళ్యాణమా
||చిగురంత ||
.
.
(Contributed by Phanindra KSM) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)