|
Context
Song Context:
గుండె లయలో గంగ అలలే చెంగుమను వేళా
కొత్త శృతిలో అష్ట దిశలు గొంతు కలిపేలా
శివ తాండవం చేయగా… |
Song Lyrics
||ప|| |అతడు|
అంతా రండోయ్ రండి తందనాలకి
సంతోషాలే తెండి ముందు నాళ్లకి
|| అంతా || |ఇద్దరు|
|ఆమె|
గుండె లయలో గంగ అలలే చెంగుమను వేళా
కొత్త శృతిలో అష్ట దిశలు గొంతు కలిపేలా
తకిట తక తకిట తకిట తక తాళమే వేయగా.. శివ తాండవం చేయగా
|అతడు|
తాళమే వేయగా.. శివ తాండవం చేయగా
|| అంతా || |ఇద్దరు|
.
||చ|| |అతడు|
కవ్వించిన కాలం కలిసొచ్చిన వైనం
కోలాటం వేస్తూ చేశే కోలాహలాన
|ఆమె|
కేరింతల మేళం.. ఎలుగెత్తిన గానం
ఊరంతా హోరెత్తించే ఈ రోజునా
|అతడు|
కోదండ రామయ్య కళ్యాణమో
|ఆమె|
గోపాల కృష్ణయ్య జన్మాష్టమో
|అతడు| అన్ని పండుగలలో |ఖోరస్| కళలు కలిపి
|అతడు| వెయ్యి వేణువులలో |ఖోరస్| స్వరములొలికి
|అతడు|
సుందర స్వప్నము కన్నుల ముందర నిలిచి పిలిచెనిదిగో
|| అంతా || |ఆమె|
.
||చ|| |అతడు|
ఎన్నో తిరనాళ్లు తిరిగొచ్చినవాళ్లు
ఏనాడు చూసి ఉండరు ఈ సంబరాలు
|ఆమె|
వెన్నెల కెరటాలు ఎగసే సంద్రాలు
ఆ నింగీ నేలా కలిపే ఈ నవ్వులూ..
|అతడు|
శ్రీవాణి కొలువైన ఈ కోవెల
|ఆమె|
సింగారమయ్యింది ఇదిగో ఇలా
|అతడు| మదిని మేలుకొలిపే |ఖోరస్| తెలుగు కొరకు
|అతడు| మనిషి మేలు తెలిపే |ఖోరస్| తెలివి కొరకు
|ఆమె|
చదువుల తల్లికి సేవలు చెయ్యగ తగిన తరుణమిదిగో
||అంతా||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)