|
Context
Song Context:
అనాధ - ప్రేమ! |
Song Lyrics
||ప|| |అతడు|
అడగకండి ఎవరూ
అడగకండి ఎవరూ, ఎవరూ ఎవరూ నువ్వెవరనీ ||2 ||
అడగకండి ఎవరూ
పుట్టుక లేని ఆ దేవుణ్ణి
పుట్టుక తెలియని ఈ జీవుణ్ణి
||అడగకండి||
.
||చ|| |అతడు |
చెంతనున్నదేదో చెయి జారిందని ఒకరు
కోరిక ఏదో తీరక కుమిలి కుమిలి ఒకరు
తోడు దూరమయ్యిందని గోడుమంటు ఒకరు
చావు వచ్చి ఒకరు పోతె బావురంటు ఇంకొకరు
రకరకాల శోకం చూస్తున్నా గాని
ఒకసారైనా నయనం చెమ్మగిల్లదేమి
|ఆమె |
కంటి నీటిలో ఉప్పదనం తెలియాలంటే ముందు ||2 ||
కమ్మని అమృతమంటి ప్రేమనూ చవి చూడటమే మందు
|అతడు|
గాలికి తిరిగి ధూళికి పెరిగిన ఒంటరి వాడిని
ఒంటరి వాడిని నే ఒంటరి వాడిని
ప్రేమను పొంది ప్రేమించేందుకు ఎవరున్నారనీ
ఎవరున్నారనీ నాకెవరున్నారనీ
|ఆమె|
ఎందుకు అనుకుంటావయ్యా నీ కెవరూ లేరనీ
అందాకా అనుకోవయ్యా నీకన్నీ నేననీ
ఎందుకు అనుకుంటావయ్యా నీ కెవరూ లేరనీ
అందాకా అనుకోవయ్యా నీకన్నీ నేననీ
.
||చ|| |అతడు|
నీ వేలి కొనలు నేను అలా తాకుతుంటే
నా గుండె లో వీణలు మ్రోగినట్టు ఉంది
|ఆమె|
అదే సుమా ప్రేమ
|అతడు|
నీ నీలి కనులలోకి తొంగి చూస్తూ ఉంటే
ఆకాశం నా కోసం దిగి వస్తూ ఉంది
|ఆమె|
అదే సుమా ప్రేమ
|అతడు|
కదిలీ కదలని పెదవుల మౌనం వింటుంటే
కధలెన్నో నువు నాకు చెబుతున్నట్టు ఉంది
|ఆమె|
అదే సుమా ప్రేమ
|అతడు|
నువ్వు పెంచిన మల్లెకొమ్మ మంచు బొట్టుగా ఏడ్చేనమ్మా
వెళ్లి పోకమ్మా నన్ను వదిలి పోకమ్మా
నువ్వు నడిచిన లోగిలమ్మా అణు వణువూ తడిసెనమ్మా
వెళ్లి పోకమ్మా నన్ను వదిలి పోకమ్మా
లోకమంతా వాన ముంతే
లోకమంతా వాన ముంతే చూపినాదమ్మా
నా చూపులో చెమ్మా చూపు లో చెమ్మా
||అడగకండి||
.
.
(Contributed by Bhavani) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
October 19th, 2010 at 11:17 am
the lyrical philosopher one and only sastri garu can write the lines like …
కంటి నీటిలో ఉప్పదనం తెలియాలంటే ముందు
కమ్మని అమృతమంటి ప్రేమనూ చవి చూడటమే మందు